బాధితులకు సాయం చేశామా లేదా అన్నది కాదు ముఖ్యం… చేశామని ప్రచారం చేసుకోవడమే ముఖ్యం అన్నట్లుగా ఉంది జగన్ రెడ్డి ప్రభుత్వ తీరు. మిచౌంగ్ తుపాను వస్తుందని పది రోజుల కిందటే వాతావరణ శాఖ ప్రకటించింది. మరి ఇప్పటికీ రైతుల పంట పాడైపోవడం.. తడిచిపోవడం వంటివి ఎందుకు జరిగాయి ?. . తుపాను వార్తలు వచ్చినప్పుడు పోలీసుల్ని.. నాగార్జున సాగర్ డ్యాంపైకి దండయాత్రకు పంపారు. తుపాను అప్రమత్తతను పట్టించుకోలేదు. తీరా వర్షాలు ప్రారంభమైన తర్వాత హడావుడి చేస్తున్నట్లుగా నటించారు.
ముఖ్యమంత్రి ఏదో చేస్తున్నారని చెప్పేందుకు ప్రతి రెండు, మూడుగంటలకు ఒకటే మ్యాటర్ తో ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది. కానీ అక్కడ జరిగేది చేసేది ఏమీ ఉండదు. కరెక్టర్లకు డబ్బులు రిలీజ్ చేస్తారో కూడా తెలియదు. వారు మాత్రం ఓ పదో, ఇరవ మందితో సాయం చేసి.. ఆహారపు పొట్లాలు ఇచ్ిచ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మిచౌంగ్ తుపాను ఇంకా తీరం దాటకుండానే వైసీపీ సోషల్ మీడియా జగన్న అందరికీ సాయం చేశారోచ్ అని ప్రచారం ప్రారంభించేసుకుంది.
తుపాను బాధిత ప్రాంతాల్లో దుర్భరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీ స్థాయిలో గాలులు రాకపోయినా… కరెంట్ మొత్తం పోయింది. రాష్ట్రం మొత్తం కరెంట్ తీసేసి కొంత దిలాసాగా ప్రభుత్వం పడుకుంది. తర్వాత ఎప్పటికో కొన్ని ప్రాంతాల్లో కరెంట్ పునరుద్ధరించారు. ఇక ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేది లేదు. .నెల్లూరు సిటీలోనే ఘోరమైన పరిస్థితులు ఉంటే… ఎమ్మెల్యే అనిల్ కుమార్ తాను కూడా బాధితుడ్నేనన్నట్లుగా కాలనీల వెంట తిరిగారు కానీ ప్రభుత్వం నుంచి ఆహారపు పొట్లం కూడా ఇప్పించలేకపోయారు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే… ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండాచేయడానికి ప్రయత్నించేది. ప్రళయం అయితే రాలేదు కానీ.. భారీగా ఆస్తి నష్టం జరుగుతుంది. పంటలు లక్షల ఎకరాల్లో పోయాయి. ఈ రైతుల్ని ఎవరు ఆదుకుంటారో తెలియదు. ఎక్కడైనా తుపానులు వస్తే బాధితులు ప్రజలు అవుతారు. ప్రభుత్వం సాయం చేస్తుంది. కానీ ఏపీలో మాత్రం తుపాను నష్టానికి సర్కార్ నిర్లక్ష్యం మరింత తోడు అవుతుంది.
కొసమెరుపేమిటంటే… టీడీపీ హాయంలో ఇలాగే ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో తీత్లీ తుపాను వచ్చింది. ప్రభుత్వం యంత్రాంగం సీఎం సహా సిక్కోలులోనే మకాం వేసి అందరికీ సాయం చేశారు. ఉత్తరాంధ్ర పాదయాత్రలో ఉన్న జగన్ రెడ్డి ఆ ప్రాంతానికి పరామర్శకు కూడా వెళ్లలేదు. టీడీపీ చాలాకొద్దిగా నష్టపరిహారం ఇచ్చిందని తాము వచ్చాక రెట్టింపు ఇస్తామన్నారు. ఐదేళ్లు గడిచినా పైసా ఇవ్వలేదు. అలా ఉంటుంది .. తుపాను బాధితులతో జగన్ రెడ్డి వాడకం.