ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఆర్ఎఫ్ నిధుల మళ్లింపు సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులను పీడీ ఖాతాలకు మళ్లించే నిర్ణయాన్ని నిలిపివేసింది. ఒక వేళ మళ్లించి ఉంటే ఇతర అవసరాలకు ఖర్చు చేయవద్దని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి కారణం కేంద్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని….నిధుల దారి మళ్లింపుపై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అఫిడవిట్ వేసింది.కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన రూ. వెయ్యి కోట్లను సీఎం జగన్ మళ్లించినట్లుగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో కూడా ప్రకటించింది. . ఈ మొత్తాన్ని ఇన్పుట్ సబ్సిడీ పేరుతో పంపిణీ చేశారని.. వాస్తవంగా రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వలేదని ప్రకటించింది. ఈ వ్యవహారం విపత్తు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మళ్లింపు సాధ్యం కాదని చెప్పడంతో మళ్లీ ఆ నిధులు జమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఆ నిధులను జమచేయడం మాత్రమే కాదు ఇప్పుడు కేంద్రం ఇ్చచే నిధులను ఆయా పథకాలకే వాడాలంటే ప్రభుత్వానికి అనేక చిక్కులు ఏర్పడతాయి. ఇప్పటికే ఉపాధి హామీ నిధులు సహా అనేక పథకాల నిధులను ఎప్పటికప్పుడు ఇతర పథకాలకు మళ్లిస్తూ బండి లాగిస్తున్నారు. కేంద్ర పథకాలను పట్టించుకోవడం లేదు. ఈ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అన్ని రకాల మళ్లింపులకు కేంద్రం వర్తింపు చేస్తే … ఏపీ సర్కార్కు మరిన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి.