మన చుట్టూ ఉండే మనుషులు ఎంత క్రూరత్వంతో ఉంటారో అంచనా వేయలేకపోతే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవచ్చేమో. తెనాలిలో ముగ్గురు ఆడవాళ్లు చేసిన ఘోరాలను పోలీసులు బయటపెడితే అందరూ ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. అప్పులు చేసి.. ఆ ఆప్పులు తీర్చమని అడుగుతున్న వారిని సైనెడ్ తో సీరియల్ హత్యలు చేశారు. చివరికి వారి బండారం బయటపడింది.
తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీకి చెందిన ఎం వెంకటేశ్వరి గతంలో డబ్బులు సంపాదించేందుకు కాంబోడియా వెళ్లి సైబర్ నేరాల్లో పాల్గొంది. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె తల్లి రమణమ్మలతో కలిసి ఈ సారి హత్యలు చేయడం ప్రారంభించింది. తల్లి కూతురు ఇద్దరూ చుట్టుపక్కల వారిని ఆప్యాయంగా పలకరిస్తూ నమ్మించి అప్పుగా డబ్బులు తీసుకుంటారు. డబ్బు తిరిగి ఇవ్వమని గట్టిగా అడిగితే వారిని ప్లాన్డ్ గా హత్య చేస్తారు.
కూల్ డ్రింక్ లు, ఆహారం, మత్తు పానీయాల్లో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేసి.. ఏమీ తెలియనట్లుగా ఉంటారు. ఇటీవల తల్లి, కుమార్తెలు రజినీ అనే మహిళ కలిసి తమకు డబ్బులిచ్చిన వ్యక్తిని బ్రీజర్ లో సైనెడ్ కలిపి మర్డర్ చేశారు. పోలీసులు తీగ లాగడంతో మొత్తం బయటపడింది. పోలీసులు తమదైన పద్దతిలో తవ్వితే నాలుగు హత్యలు బయటపడ్డాయి. డబ్బు కోసం, అప్పులు ఎగ్గొట్టేందుకు ఈ హత్యలు చేశారు. ముగ్గురిలో ఒకరు గతంలో వలంటీర్‌గా పని చేశారు.
అందుకే విచ్చలవిడిగా బతికే వారు.. నేర ప్రవృతి ఉన్నవారు ఆప్యాయత చూపినా జాగ్రత్తగా ఉండాల్సిందే.