పోలవరం పూర్తి చేయలేదు.. ఏం పీక్కుంటారో పీక్కోండి..! అని.. పోలవరం పూర్తి చేసే డెడ్ లైన్ ముగిసిపోయిన అంశంపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో డిసెంబర్ 1, 2021 కల్లా పూర్తిచేసి ప్రారంభిస్తామని చాలెంజ్ చేశారు జలవనరుల మంత్రి అనిల్ కుమార్. ఆయన మామూలుగా చెప్పలేదు. మిమిక్రి చేశారు. డైలాగులు కొట్టారు. సినిమా డైలాగులతో చెప్పారు. వియ్ ఆర్ కమిటెడ్ అన్నారు. ఒక్క సారి కమిటైతే మా మాట మేమే వినమన్నట్లుగా ఆయన అసెంబ్లీలో రక్తి కట్టించారు.
దీంతో ఆ వీడియోను నిన్న అంతా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. ప్రస్తుతం పోలవరం పనుల స్టేటస్‌ను కూడా పెట్టారు. రెండున్నరేళ్లలో మూడు శాతం పనులు కూడా పూర్తి కాలేదు. దీనిపై అనిల్‌కుమార్‌ను నెటిజన్లు కాస్త గట్టిగానే ప్రశ్నించారు. టీడీపీ సోషల్ మీడియా విభాగం అయితే మొత్తం ఈ వీడియోను శక్తి మేర వైరల్ చేసింది. దీనిపై మంత్రి అనిల్ చివరికి స్పందించాల్సి వచ్చింది. అనుకున్న గడవు ప్రకారం పూర్తి చేయలేదని ఏం చేసుకుంటారో చేసుకోమని తేల్చేశారు.
అన్నింటికీ వైసీపీ నేతల సమాధానం ఇంతే ఉంది. గతంలో సన్న బియ్యం ఇస్తామని చెప్పి మాట మార్చారు. మీ అమ్మ మొగుడు చెప్పాడా అంటూఓ మంత్రి చెలరేగిపోయారు. ఇప్పుడు అనిల్ కుమార్ వంతు. ప్రజల్ని ఎంతో తక్కువగా అంచనా వేయబట్టే.. ఈ నేతలు ఇలా దిగజారిపోతున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అయినా వారు వెనక్కి తగ్గలేదు.