ఎఫ్ 3 తరవాత అనిల్ రావిపూడి సినిమా నందమూరి బాలకృష్ణతో అనే విషయం తెలిసిందే. నిజానికి ఈ కాంబో ఎప్పుడో సెట్ అవ్వాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల ఆగిపోయింది. ఇది వరకు ‘రామారావు గారు’ అనే కథని బాలకృష్ణ కోసం తయారు చేశాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు అదే కథని అటూ ఇటూ మార్చి బాలయ్యతో తీయబోతున్నాడన్నది టాక్. ఈ విషయంలో అనిల్ రావిపూడి స్పష్టత ఇచ్చారు.
”అప్పట్లో బాలకృష్ణ గారి కోసం `రామారావు గారు` అనే కథని తయారు చేశాను. కానీ ఇప్పుడు ఆ కథని పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితిని బట్టి, మూడ్ ని బట్టి కథలు రాసుకోవాలి. అందుకే బాలయ్య కోసం కొత్త కథ రాసుకున్నా. నా స్టైల్లో ఉంటూనే… బాలయ్య గారి స్థాయికి తగిన కథ. ఆయన్నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాల్ని పొందుపరిచా. కచ్చితంగా వేరే లెవల్ లో ఉంటుంది” అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎఫ్ 3 తో బిజీగా ఉన్నారు అనిల్ రావిపూడి. మంగళవారం అనిల్ రావిపూడి పుట్టిన రోజు. ఎఫ్ 3 సెట్లోనే ఆయన బర్త్ డే జరుపుకుంటున్నారు. తన ప్రతీ సినిమాలోనూ తళుక్కున మెరవడం అనిల్ రావిపూడికి అలవాటు. `ఎఫ్ 3`లోనూ ఆ సెంటిమెంట్ కొనసాగిస్తూ…. ఓ పాటలో అనిల్ రావిపూడి గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు.