హైదరాబాద్: అక్టోబర్ 2నుంచి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు, సామాజిక కార్యకర్త అన్నాహజారే ఇవాళ ప్రకటించారు. భూ సేకరణ బిల్లు, ఒకటే హోదా-ఒకటే అంశాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో నిరాహారదీక్షకు కూర్చుంటున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను చట్టం చేయొద్దని కోరుతూ అన్నా హజారే ఈ ఏడాది మొదట్లో ప్రధాని నరేంద్ర మోడికి ఒక లేఖకూడా రాశారు. కేంద్రానికి భూ సేకరణ ఆర్డినెన్స్‌ను చట్టంగా చేయటంలో ఉన్న ఆసక్తి ఒకటే హోదా-ఒకటే పింఛను పథకం అమలుపై లేదని అన్నా ఇటీవల పలుసార్లు విమర్శలు చేశారు. అన్నా గతంలో లోక్‌పాల్ బిల్లుకోసంకూడా ఆమరణ నిరహారదీక్ష చేయటం, నాటి యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి లోక్‌పాల్ బిల్లును పాస్ చేయించం తెలిసిందే.