68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన శుక్రవారం సాయింత్రం వెలువడనుంది. ఈ అవార్డుల్లో ప్రతీసారీ.. తెలుగు సినిమాకి మొండి చేయి చూపించడం మామూలే. కాకపోతే.. 2021లో తెలుగులోనూ మంచి సినిమాలొచ్చాయి. ఆర్.ఆర్.ఆర్ ఈ యేడాది విడుదలైనా, 2021లో సెన్సార్ జరుపుకొంది. అంటే… 2021 అవార్డులకు ఆర్.ఆర్.ఆర్ గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైనింగ్, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఈ సినిమా గట్టి పోటీ ఇవ్వనుంది. `పుష్ప` కూడా… 2021లోనే వచ్చింది. ఈ సినిమాని జాతీయ అవార్డుల పరిశీలనలో పరిగణలోకి తీసుకొంటారు. జాతిరత్నాలు, శ్రీకారం, నాంది, సినిమా బండి… ఇలా కొన్ని చిన్న సినిమాలు అవార్డు రేసులో ఉన్నాయి. ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా వీటిలో ఏదైనా నిలవొచ్చు. 2021లో ఓటీటీ వేదిక చేసుకొని విడుదలైన సినిమాలే ఎక్కువ. వాటిలో కొన్ని అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలతో రూపొందినవి. వాటికి అవార్డులొచ్చే ఛాన్సుంది. గతేడాది అద్భుతమైన విజయం సాధించిన `జై భీమ్` పేరు ఈసారి అవార్డుల జాబితాలో గట్టిగా వినిపించే ఛాన్సుంది. కాకపోతే.. అది తమిళ సినిమా. ఎప్పటిలానే ఈసారి మలయాళం చిత్రసీమ ఎక్కువ అవార్డుల్ని ఎగరేసుకొని వెళ్లే ఛాన్సుంది. చూద్దాం.. రేపటి ఫలితాలు ఉలా ఉంటాయో..?