జనసేనానికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యం లో జరగనున్న సమ్మిట్ లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ లో ప్రసంగించే అరుదైన అవకాశం పొందారు. నవంబర్ 17 న జరగనున్న ఈ సమ్మిట్ లో “గెస్ట్ ఆఫ్ ఆనర్” సత్కారాన్ని కూడా ఆయన పొందనున్నారు.
ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం, ప్రతి యేడూ ఇండియా కి యూరోప్ కి మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించే వివిధ అంశాలపై ఇలాంటి శిఖరాగ్ర సమావేశాలు (సమ్మిట్స్) నిర్వహిస్తూ ఉంటుంది. ఈ యేడాది “భారత్ లో పెట్టుబడులు” అనే అంశం మీద జరగనున్న ఈ సమవేశం లో వక్తలు ప్రసంగిస్తారు. బ్రిటిష్ పార్లమెంట్ లో జరగనున్న ఈ సమావేశం లో ఈ సారి పవన్ కళ్యాణ్ ని పాల్గొనాల్సిందిగా ఆహ్వానమందింది. ఇవాళ జనసేన ఆఫీస్ లో పవన్ కి అందించిన ఈ ఆహ్వానం లో పవన్ ఉద్దానం సమస్య తీర్చడానికి కృషి చేసిన విధానాన్ని, చేనేత కి ఎపి లో బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ చేనేతల కుటుంబాలకి సహాయకారిగా ఉండేందుకు తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.
ఇంతకు మునుపు హార్వర్డ్ లో పవన్ ప్రసంగించినపుడు చక్కటి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం సదస్సు లో ఇండియాకి పెటుబడులు ఆకర్షించే రీతిలో పవన్ ప్రసంగం ఉండనుంది.