చిత్ర పరిశ్రమ ఇప్పటివరకూ కొన్ని వందల మంది హీరోయిన్స్ ని చూస్తుంటుంది. అయితే ‘హీరోయిన్’ అనే మాటకు వన్నె తెచ్చిన వాళ్ళును వేళ్ళతో లెక్కకట్టేయోచ్చు. కన్నాంబ.. సావిత్రి.. అంజలి.. భానుమతి….సరోజాదేవి..జమున.. ఇదీ తొలి తరం హీరోయిన్ల లెక్క. తర్వాత కాలంలో హీరోయిన్ ఈక్వేషన్ మారింది. పరిశ్రమలో ఓ పదేళ్ళు పాటు కెరీర్ కొనసాగితేనే హీరోయిన్ అనే ఒపినియన్ వచ్చింది. ఈ దశలో వాణిశ్రీ.. జయసుధ, జయప్రద, శ్రీదేవి.. హీరోయిన్స్ గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. వీరి తర్వాత.. విజయశాంతి, రమ్యకృష్ణ, సౌందర్య.. హీరోయిన్ టైటిల్ కు యాప్ట్ గా నిలిచారు. వీరి టైంలో చాలా మంది వచ్చారు కానీ .. అలా వచ్చామా ఇలా వెళ్లిపోయామా అన్నట్టుగా సాగింది. అయితే విజయశాంతి సౌందర్యల తర్వాత హీరోయిన్ ఈక్వేషన్ పూర్తిగా మారిపోయింది. గ్లామర్ వార్ మొదలైపోయింది. శ్రీదేవి, విజయశాంతి, రమ్యకృష్ణ.. టైమ్స్ లోనే ఈ గ్లామర్ పాయింట్ వుంది కానీ తర్వాత కాలంలో అదే మెయిన్ స్ట్రీమ్ ఎలిమెంట్ అయిపోయింది. టాప్ హీరోయిన్.. టాప్ లీగ్.. అనే మాటలు వినిపించాయి. అంటే ఒక హీరోయిన్ వస్తుందంటే..టాప్ హీరోస్ అందరితోనూ జతకట్టేసి తర్వాత మెల్లగా నల్లపూస అయిపోయిన పరిస్థితన్నమాట. మహా అయితే ఓ మూడేళ్ళు. అంతే… ఇలా చాలా మంది హీరోయిన్స్ వచ్చి వెళ్ళిపోయారు. సావిత్రి, వాణిశ్రీ, శ్రీదేవి, విజయశాంతిలా లాంగ్ ఇన్నింగ్ అనే మాటే గగనమైపోయింది. ఇలాంటి సమయంలో ఓ నక్షిత్రంలా మెరిసింది ”అరుధంతి” అనుష్క. హీరోలతో దీటుగా క్రేజ్ ను సాధించి బ్యూటీ స్వీటీ అనిపించుకుంది.
అలా మొదలైయింది..
అక్కినేని నాగర్జున, అప్పటికి ఫుల్ క్రేజ్ లో వున్న పూరిజగన్నాధ్ కలయికలో వచ్చిన సినిమా ”సూపర్”. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైయింది అనుష్క. ఇందులో అమెది సెకెండ్ హీరోయిన్ పాత్ర. జస్ట్ గ్లామర్ డాల్. ఈ సినిమాలో అనుష్క చూసి .. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే హీరోయినే అనుకున్నారంతా. అనుష్క కెరీర్ కూడా మొదట అలానే సాగింది. రెండో సినిమా సుమంత్ తో చేసింది. ఇక అంతే అనుకున్నారు. అయితే ”విక్రమార్కుడు” సినిమా స్వీటీకి ఒక టర్నింగ్ పాయింట్. నటన మాట పక్కన పెడితే.. ఇందులో అనుష్క గ్లామర్ .. కుర్రకారు మదిలో జింతాక్ జింతాక్… జుమ్ జుమ్ మాయ.. ఇలా విక్రమార్కుడు స్వీటీని కమర్షియల్ హీరోయిన్ గా నిలబెట్టిన చిత్రమైయింది.
తర్వాత కూడా గొప్పగా ఏం లేదు..
2006లో వచ్చిన విక్రమార్కుడు అనుష్కకు కమర్షియల్ హీరోయిన్ ట్యాగ్ ను ఇచ్చిందే కానీ తనకంటూ ఒక ప్రత్యేకత ఇచ్చే సినిమాలు ఏమీ రాలేదు. ఈ దశలో గ్లామర్ కు పరిమితమైన పాత్రలే చేసింది. అస్త్రం, లక్ష్యం, శౌర్యం, ఒక్కమగాడు, స్వాగతం, బలాదూర్ ఇలా.. సో సో పాత్రలతోనే సరిపెట్టుకుంది స్వీటీ. ఏవో సినిమాలు చేస్తున్నాం అన్నట్లుగానే వుండేది.
‘అరుంధతి’ ప్రభంజనం..
అనుష్క సినీ ప్రయాణాన్ని ఓ మలుపు తిప్పేసిన చిత్రం ‘అరుంధతి’. ఈ సినిమాతో అభినయం పరంగా ఒక్కసారి వందమెట్లు ఎక్కేసింది అనుష్క. అప్పటివరకూ సగటు హీరోయిన్ లా కనిపించిన అనుష్క .. ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్ళిపోయింది. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించడమే కాదు.. జేజమ్మ లాంటి పాత్రల్లో ఆమె ఒదిగిన తీరు అందర్నీ కట్టిపడేసింది.అప్పటివరకూ గ్లామర్ పాత్రల్లో మెప్పించిన అనుష్క ఒక్కసారిగా జేజమ్మ అవతారం ఎత్తే సరికి యాక్టింగ్ పరంగా ఆమెకున్న క్యాలిబర్ చూసి ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. అప్పటి నుంచీ ‘అందం అభినయనం ‘కలగలిపిన రూపం అనుష్క అని పేరు తెచ్చుకుంది స్వీటీ. ఈ సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. సినిమా ఫలితంతో సంబధం లేకుండా ఒక హీరోయిక్ స్టార్ డమ్ తో దూసుకుపోయింది.
ఇంతలోనే అంత గ్లామరా..
‘అరుంధతి’ సినిమా తర్వాత అనుష్క డిఫరెంట్ ఇమేజ్ మెంటైన్ చేస్తుందేమో అనుకున్నారంతా. అయితే అనుష్క షాక్ ఇచ్చింది. వెంటనే మళ్ళీ గ్లామర్ డాల్ గా కనిపించింది. మాములుగా కాదు ఏకంగా స్విమ్ బికినీలో కేక పుట్టించేసింది. నిజంగా అంత బోల్డ్ బికినీ వేసిన సందర్భాలు అప్పటివరకూ తెలుగు తెరపై లేవు. అందులోనూ ‘అరుంధతి’తో ఓ డిఫరెంట్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న స్వీటీ.. ఒక్కసారిగా ”బిల్లా”.. అంటూ బికినీ వేసేసరికి షాక్ అయిపోయారంతా. అయితే అనుష్క శరీర సౌష్టవం.. ప్రేక్షకుల మతిని పోగొట్టేసింది. అనుష్కని అటు జేజమ్మాగాను ఇటు స్వీటీ హాటీగానూ చూడ్డానికి ప్రేక్షకులు ఆమోదం తెలిపేశారు. దీంతో రెండు వైపులా బ్యాలెన్సింగ్ గా వుండే పాత్రలు చేసుకుంటూ వెళ్ళింది స్వీటీ.
నచ్చితే దేనికైనా రెడీ
కధ నచ్చితే దేనికైనా రెడీ అనే హీరోయిన్ అనుష్క. దీనికి చక్కటి ఉదాహరణ ”వేదం” సినిమా. అనుష్క జేజమ్మగా గుర్తుంచుకుంటారు అభిమానులు. అలాంటి అనుష్కను వేశ్యపాత్రలో చూపించడమా ? సాహసం కదా? అయితే ఈ సాహసాన్ని చేశారు దర్శకుడు క్రిష్. ఆయనకు ఏం అనిపించిందో కానీ వేదం సినిమాలో కీలకమైన వేశ్య పాత్రను అనుష్కకి చెప్పారు. కధ విన్న అనుష్క.. మరో మాట లేకుండా ”యస్” చెప్పేసింది. ఇందులో అమలాపురం సరోజగా.. ఆమె కనబరిచిన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇందులో అనుష్క నటనను చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
అనుష్క సాహసానికి మరో ఉదాహరణ ”సైజ్ జీరో”. ఈ సినిమా కోసం పెద్ద సాహసమే చేసింది అనుష్క. ఎత్తుకు తగ్గ బరువుతో ఎట్రాక్టింగ్ లుక్ లో వుటుంది స్వీటీ. అయితే ఈ సినిమా కోసం ఓ పీపాలా తయారైయింది. ”అందం, ఆకృతి అమ్మయికి అవరోధాలు” కావు అనే సందేశం ఇద్దామని. సినిమా ప్రేక్షకులకు అంతగా చేరువకాలేదు కానీ అనుష్క ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే పెరిగిన బరువు తగ్గించుకోవడానికీ ఇప్పటికీ కష్ట పడుతుంది స్వీటీ.
అనుష్క లేకపొతే ఆ సినిమాలు లేవు
‘అరుంధతి’ సినిమా తర్వాత ఓ బ్రాండ్ గా మారింది అనుష్క. దర్శక రచయితలు ఆమె కోసమే పాత్రలు రాయడం మొదలుపెట్టారు. అనుష్కను ద్రుష్టిలోపెట్టుకొని సినిమాలు రూపుందించడం మొదలైయింది. ఇలా వచ్చిన సినిమా ”రుద్రమదేవి”. కాకతీయ సామ్రాజ్ఞి రుద్రామాంబగా కనిపించింది అనుష్క. ఈ సినిమా గురించి దర్శకుడు గుణశేఖర్ చెబుతూ.. అనుష్క లేకపోతే అసలు ఈ కధను తీసేవాడినే కాదని, అనుష్క లాంటి నటి వుండటం వల్లే రుద్రమదేవి సాధ్యమైయిందని చెప్పారు. బాహుబలి ”దేవసేన” కూడా అంతే. బాహుబలి కధ అనుకున్నప్పుడు క్లియర్ ఇమేజ్ లేదు. కానీ దేవసేన పాత్ర అనుకున్నపుడు మాత్రం నామొదటి ఇమేజినేషన్ అనుష్కనే. ఆ పాత్రలో అనుష్క లేకపోతే ఇంత గ్రాండ్ వచ్చేది కాదు సినిమా” అని స్వయంగా రాజమౌళి చెప్పారంటే అర్ధం చేసుకోవచ్చు అనుష్క స్టామినా. ఇప్పుడు రాబోతున్న భాగమతి సినిమా కూడా కంప్లీట్ అనుష్క సినిమానే. అనుష్క స్టార్ డమ్ ను ఆమె క్యాలిబర్ ను ద్రుష్టిలో పెట్టుకొని వస్తున్న సినిమానే.
అప్సరస లాంటి అందం
దేవకన్యలు, అప్సరసలు, రంభ ఊర్వసి మేనకలను ఎవ్వరు చూడలేదు. కానీ అనుష్క ను చూస్తే వాళ్ళు ఇలానే వుంటారేమో అనిపిస్తుంది. అంత అందం అనుష్క సొంతం. అల్ట్రా మోడరన్ గా కనిపించినా, బికినీ వేసినా, చీర కట్టినా అనుష్కకే చెల్లింది. హీరోయిన్స్ విషయంలో దక్షినాది ప్రేక్షకుల అభిరుచి కాస్త డిఫరెంట్ గా ఉటుంది. మరీ జీరో సైజులు కోరుకోరు. కంటికి కాస్త ఇంపుగా కనిపించాలి. ఈ విషయంలో అనుష్కకి ఫుల్ మార్కులు పడిపోతాయి. ప్రేక్షకుల మనసులు పిండేసే గ్లామర్ అనుష్కది. ఒక్కమాటలో చెప్పాలంటే స్పూరద్రూపి అనుష్క.
విమర్శలు- పొగడ్తలు
బోర్న్ ఆర్టిస్ట్ అవ్వక్కర్లేదు. కష్టపడితే ఎలాంటి నైపుణ్యానైన మెరుగుపర్చుకోవచ్చు అనే మాటకు నిదర్శనం అనుష్క. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసలు అనుష్కకి యాక్టింగ్ వచ్చేది కాదు. ఒకే ఎక్స్ ప్రెషన్. డ్యాన్స్ కూడా అంతంత మాత్రమే. కొన్ని సన్నివేషాల్లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ పలికించాలో కూడా తెలిసేది కాదు. ఈ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొనేది అనుష్క. ప్రభాస్ లాంటి స్నేహితులు ఆమెను ”ఇంటర్ నేషనల్ యాక్టర్” అని ఆట పట్టించేవారట. అంటే ఇచ్చే ఎక్స్ ప్రెషన్ కి మీనింగ్ ఏమిటో అర్ధం కాకపోవడం. నిజమే.. ఈ విషయాన్ని అనుష్క కూడా అంగీకరించింది. అలా అని కృంగిపోలేదు. తనకు వచ్చిన పాత్రలను అర్ధం చేసుకోవడం మొదలుపెట్టింది. ‘అరుంధతి’ సినిమాతో ఆమె ప్రయాణమే మారిపోయింది. ఒక పాత్రలో పరకాయప్రవేశం ఎలా చేయాలో.. ఒక డిఫినేషన్ సెట్ చేసింది స్వీటీ. ఈ సినిమా తర్వాత ఇక అనుష్క మళ్ళీ యాక్టింగ్ పరంగా మళ్ళీ వెనక్కి తిరిగిచుకుకోలేదు. ఆమె నటనలో చాలా ఈజ్ వచ్చేసింది. అనుష్క అంటే అందంమే కాదు అభినమయం కూడా అని తన చిత్రాల ద్వారనే చాటి చెప్పింది.
హాట్ హాటు ఎఫైర్లు..
అనుష్క ఇండస్ట్రీలోకి వచ్చి 12ఏళ్ళు దాటిపోయింది. ఈ 12ఏళ్ళలో ఎన్నో విజయాలు, ఎంతో స్టార్ డమ్, ఇంకెంతో ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అయితే వీటితో పాటు గాసిప్పులు కూడా అనేకం. వాస్తవానికి అనుష్కపై వచ్చిన గాసిప్పులు మరే హీరోయిన్ పై రాలేదంటే అతిశయోక్తి కాదు. సూపర్ తో మొదటి ఛాన్స్ ఇచ్చిన నాగార్జునతో అనుష్కకి ఎఫైర్ వుందని మాట్లాడుకున్నారు. అక్కడితో ఆగలేదు నాగచైతన్యతో కూడా ముడిపెట్టారు. కొంతకాలం తర్వాత హీరో గోపిచంద్ తో అన్నారు. ఆ తర్వాత ఒక బిజినెస్ మెన్ ప్రేమలో అన్నారు. ఇప్పుడు ప్రభాస్ తో ముడిపెడుతున్నారు. ”మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతున్నా” సమ్ థింగ్ సమ్ థింగ్ అనే గాసిప్పులు ఆగడం లేదు. అయితే ఈ గాసిప్పులను లైట్ తీసుకోవడం అలవాటు చేసుకుంది అనుష్క. మొదట్లో చాలా హర్ట్ అయిపోయే అనుష్క ఇప్పుడీ గాసిప్స్ ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ”బాబోయ్ ఇంకా నాకెన్ని పెళ్లిళ్ళు చేస్తారు” అని తనపై తనే జోక్స్ కట్ చేస్తుంటుంది స్వీటీ.
పెళ్లి ఎప్పుడు ??
అనుష్కకి 35ఏళ్ళు దాటేశాయి. ఇండస్ట్రీలో ఆడుగుపెట్టినప్పటి నుండి అనుష్క పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఈ విషయంలో ఎన్ని వార్తలు వచ్చినా అవి గాలివార్తలు గానే మిగిలిపోతున్నాయి. అనుష్కని చాలా మందితో ముడి పెట్టారు. కానీ బ్రహ్మ ముడి వేసే వ్యక్తి అయితే ఇప్పటికీ వరకూ కనిపించలేదు. అయితే త్వరలోనే అనుష్క తన కాబోయేడాని ఫిక్స్ చేస్తుందని, ఆమె మనసు పెళ్లి వైపుకు మళ్లిందని అంటున్నారు. సినిమాలు తగ్గించుకోవడానికి కూడా కారణం ఇదే అని చెబుతున్నారు. దగ్గరలోనే ఆమె వివాహం ఉటుందని సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. మరి దేవసేన చేయి పట్టుకునే ఆ రాజకుమారుడు ఎవరో.. ప్రస్తుతానికి సస్పెన్స్
మంచితనంతో మర్డర్ చేస్తుంది..!
అందమైన రూపమే కాదు. అందమైన మనసూ అనుష్క సొంతం. 12ఏళ్ళు సుధీర్గ కెరీర్ లో ఎప్పుడూ వివాదాల జోలికి పోలేదు అనుష్క. తనపై ఎన్ని రూమర్లు వచ్చినా మౌనంగా భరించిందే కానీ ఎప్పుడూ బరస్ట్ కాలేదు. దీనికి కారణం ఆమె మనస్తత్వం అని చెబుతారు సన్నిహితులు. అసలు అనుష్క సహనం కోల్పోయిన సందర్భాలు చాలా తక్కువట. నచ్చితే స్నేహం చేస్తుంది. నచ్చకపోతే మౌనంగా తప్పుకుంటుంది. అంతేకానీ అనవసరమైన టాపిక్కుల జోలికి వెళ్ళేరకం కాదు. క్రమ శిక్షణ విషయంలో కూడా అనుష్కని మెచ్చుకొవాలి. 12ఏళ్ళు కెరీర్ లో ఏ నిర్మాత కూడా అనుష్క వల్ల ఈ ఇబ్బంది వచ్చింది అనే ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. అంత మంచి ట్రాక్ రికార్డ్ ను సొంతం చేసుకుంది అనుష్క.
అంతేకాదు స్వీటీది చాలా స్వీట్ హార్ట్ అని చెబుతారు. ఆమె మంచితనం చూస్తే భయం వేస్తుందని రానాలాంటి నటులు నవ్వుతూ చెబుతుంటారు. ”అసలు అంత మంచితనంగా ఎలా వుంటారు. అనుష్క చూస్తే మనిషి అంటే ఇలా వుండాలి కదా అనిపిస్తుంది. అనుష్కతో పోల్చుకుంటే అసలు నేను మనిషినేనా అనే డౌట్ వచ్చేస్తది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచితనంతో మర్డర్ చేసేస్తుంది…!” అని ఓ సందర్భంలో అనుష్క గొప్పమనసు గురించి చెప్పాడు రానా.
జాలి దయ కరుణ గుణాలు కూడా అనుష్కలో ఎక్కువే. తన పేరుతో చారిటీలు లాంటివి పెట్టలేదు కానీ.. సాహయం కోరిన వచ్చిన వారికి తన వంతు సాయం అదించడంలో వెనకడుగువేయదట అనుష్క. అయితే తన పేరు బయటికి రావడం ఇష్టపడదట. గుప్తదానాలన్నమాట.
డబ్బు లెక్కలు తక్కువ
ఈ సుధీర్గమైన కెరీర్ లో ఎంత సంపాదించారు అంటే.. ‘డబ్బులు లెక్కలు నాకు నచ్చవండి”.. అని నవ్వేస్తుంది స్వీటీ. ” నాకు డబ్బు లెక్కపెట్టుకోవడం ఇష్టం వుండదు. డబ్బు సంపాదించి మన కోసం వున్న వాళ్ళకు ఖర్చు పెట్టేయడమే తెలుసు. మళ్ళీ సంపాధించుకోవచ్చు అన్న ధీమా. సినిమాని బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తా. అలాగే కొన్ని సినిమాలకు పారితోషికం తీసుకోను. డబ్బు కోసమే నటించను. కథ నచ్చితే ఏదైనా చేస్తాను. నా కెరీర్లో సంపాదించడం తప్పితే పోగొట్టుకోవడం లేదు. డబ్బు, నటన..అభిమానం.. ఇదంతా సంపాదనే” అని చెబుతుంటుంది అనుష్క.
భాగమతి కోసం వెయిటింగ్
బాహుబలిలో దేవసేన యువరాణిగా ప్రేక్షకుల మదిని పిండేసిన అనుష్క తర్వాత కాస్త సైలెంట్ అయిపోయింది. అనుష్క ‘యస్” అంటే కోట్లు కుమ్మరించే నిర్మాతలు వున్నా.. ఎందుకో స్వీటీ సినిమాలు తగ్గించేసింది. ఇప్పుడు ఆమె చేతిలో వున్న ఏకైక సినిమా భాగమతి. ఈ సినిమాలో అనుష్క ద్విపాత్రభినయం చేస్తుందట. నిన్ననే ఫస్ట్ లుక్ బయటికివచ్చింది. షాకింగ్ లుక్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది స్వీటీ. అనుష్క సోలో క్యాలిబర్ పై నిర్మాతలకు ఘాడమైనవిశ్వాసం వుంది. అందుకే కేవలంఅనుష్క స్టామినాను నమ్మే కోట్లు ఖర్చుపెట్టారు భాగమతి కోసం. తన క్యాలిబర్ ఏంటో అరుంధతి సినిమాతో నిరూపించిన జేజమ్మ.. భాగమతితో కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయాలనే కోరుకుందాం.
అన్నట్టు.. ఈ రోజు అనుష్క పుట్టిన రోజు. వెండితరపై సుధీర్గ ప్రయాణం కొనాసాగిస్తూ.. ఇప్పటికీ టాప్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకొని అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన స్వీటీకి హ్యాపీ బర్త్ డే.