ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.
స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈమేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. స్వప్రయోజనాల కోసమే వైసీపీ ఎక్సైజ్ పాలసీ రూపొంచింది అని కేబినెట్ అభిప్రాయపడింది. దీంతో కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.ఈ సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరును తొలగించాలని నిర్ణయించారు. రీ సర్వే ప్రక్రియను అబయెన్స్ లో పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన 217జీవోను రద్దు చేసింది. అలాగే, మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.