సీఐడీ అధికారులను అడ్డుకున్నానని నీలి మీడియా నీతి లేని రాతలు రాసిందని … నిజంగా తాను అడ్డుకుని ఉంటే జగన్ వదిలి పెట్టేవారా.. సీఐడీ కేసు పెట్టేవాళ్లు కాదా అని ఆర్కే చేస్తున్న హడావుడికి కాస్త ఆలస్యంగా అయినా రిప్లయ్ వచ్చింది. ఆంధ్రాలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి హైదరాబాద్‌కు పంపించారు సీఐడీ పోలీసులు. ఘటన జరిగింది హైదరాబాద్‌లో కనుక అక్కడ కేసు పెట్టాల్సింది.. ఫిర్యాదు చేయాల్సింది సీఐడీ అధికారులు. కానీ లక్ష్మినారాయణ ఇంట్లో సోదాలు.. ముగిసిన తర్వాత విజయవాడ వెళ్లిన తరవాత తీరిగ్గా అక్కడ జీవో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మామూలుగా అయితే ఏపీ అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారనే ప్రచారంతో.. విమర్శలతో సరి పెట్టేవారమో..?.కానీ నీలీ మీడియా నీతి లేని మీడియా అంటూ.. రెండు రోజుల నుంచి హోరెత్తించడంతో అధికార పార్టీ పెద్దలకు ఆగ్రహం వచ్చినట్లుగా కనిపిస్తోంది.36 గంటల తర్వాత ఫిర్యాదు చేయడం.. వీడియోలో ఎక్కడా అడ్డుకున్నట్లుగా లేకపోవడం వంటివి చూసి చాలా మందికి ఈ కేసు విషయంలో ఆశ్చర్యపోవచ్చు కానీ.. ఏపీ ప్రభుత్వ పెద్దలు సీఐడీని వారు ఎలా వాడుకుంటారో ఇప్పటికే రెండున్నరేళ్లుగా చూస్తూనే ఉన్నారు.
రాధాకృష్ణపై కేసులో ఏమీ తేలుతుందనేది తర్వాత విషయం కానీ రాధాకృష్ణపైఓ కేసు నమోదయింది. ఈ కేసులో కోర్టులో తేలిపోయినా… సీఐడీకి పోయేదేమీ లేదు. ఏపీ ప్రభుత్వ పెద్దలకు పోయేదేమీ లేదు. అలాంటివి వారు ఎప్పుడో వదిలేశారు. మొత్తంగా చూస్తే ఏబీఎన్ ఆర్కేపై కేసులు పెట్టి తీరాలన్న ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఓ చాన్స్‌ను ఆర్కేనే ఇచ్చినట్లయింది.