ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేసి రిటైరైన లక్ష్మినారాయణ అనే ఐఏఎస్ అధికారిపై ఏపీ సీఐడీ అదికారులు గురి పెట్టారు. వేధించాలని అనుకున్న వారిని ఎలా అయితే అర్థరాత్రి పూట.. అపరాత్రి పూట దాడి చేసి భయభ్రాతాలకు గురి చేస్తారో అచ్చంగా అలాగే హైదరాబాద్‌లోని లక్ష్మినారాయణ ఇంటిపై ఆర్థరాత్రి రెండున్నర సమయంలో సీఐడీ అధికారులు వచ్చారు. సోదాలంటూ హడావుడి చేశారు. ఆయన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరక్టర్‌గా పని చేశారు. రిటైరైన తర్వాత ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు.
ఏపీ స్కిల్ డెలవప్మెంట్ డైరక్టర్‌గా ఉన్న సమయంలో రూ. 200 కోట్లకుపైగా గోల్ మాల్ జరిగిందని సీఐడీ అధికారులకు సెప్టెంబర్ లో ప్రస్తుతం స్కిల్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పుడు కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు ఇప్పుడు సోదాలకు వచ్చారు. ఆయన ఇంట్లో సోదాలు జరుపుతున్న విషయం తెలియడంతో ఉదయమే ఏబీఎన్ ఆర్కే వారింటికి వెళ్లాడు. సీఐడీ అధికారులు ఆయనతో తాముఎందుకు సోదాలు చేస్తున్నామో చెప్పారు. తర్వాత పయ్యావుల కేశవ్ వంటి టీడీపీ నేతలూ వచ్చారు. తెలంగాణ టీడీపీ కార్యకర్తలు వచ్చి సీఐడీ అధికారులకు వ్యతిరేకంగా నిదాలు చేశారు.
సీఐడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్న సమయంలో లోబీపీరావడంతో లక్ష్మినారాయమ కళ్లు తిరిగిపడిపోయారు. దీంతో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. సంస్థ కార్యకలాపాలు ఎండీ పేరు మీదుగా నడుస్తాయని డైరక్టర్‌కు సంబంధంలేదని. రోజు వారీ వ్యవహారాలతో కానీ. ఆ సంస్థ ఏమైనా కొనుగోళ్లు లేదా ఒప్పందాలు చేసుకుని ఉంటే తనకేం సంబంధంలేదని లక్ష్మినారాయణ సీఐడీ అధికారులకు చెప్పారు. అలాంటి వాటి కోసం అధికారుల కమిటీ ఉంటుందన్నారు.
అయితే ఆయన కోసం టీడీపీ నేతలు, ఏబీఎన్ ఆర్కేనే వచ్చారంటేనే లక్ష్మినారాయణ తన సర్వీసులో టీడీపీ నేతలతో ఎంతసన్నిహితంగా ఉన్నారో అర్థమవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఆయనటార్గెట్ అయి ఉంటారని భావిస్తున్నారు.