ఏపీ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం కోర్టుల్లో పిటిషన్లు వేసి ఆజ్ఞాతంలో ఉన్న ఆయనను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గాలిస్తున్నారో లేదో కానీ బయటకనిపిస్తే మాత్రం అరెస్ట్ చేయడం ఖాయం. ఈ పరిస్థితి తేవడానికి ముఖ్య లక్ష్యం..ఇతర ఉద్యోగ సంఘ నేతల్ని నోరు తెరవకుండా చేయడం. నోరు తెరిచేవారిని కంట్రోల్ చేయడం. ఆ లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించేసింది.
ఉద్యోగ సంఘాలతో భేటీ తర్వాత బొప్పరాజు వెంకటేశ్వర్లు… ప్రభుత్వం చాలా వరకూ డిమాండ్లు నెరవేర్చిందని చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు.. ఏ డిమాండ్లు నెరవేర్చింది.. నేరవేరుస్తామని మాత్రం చెప్పింది. అది ఎప్పుడూచెప్పేదే. ఇవ్వాల్సిన డీఏ బకాయిలూ.. వచ్చే ఐదేళ్ల వాయిదాలో ఇస్తామని కబుర్లు చెబితే ఆహా ఓహో అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణలో అడ్డగోలునిబంధనలు పెట్టి అతి కొద్ది మందిని పర్మినెంట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇలాంటివి చెప్పుకుంటే ఉద్యోగుల ప్రయోజనాలు ఇంత వరకూ నెరవేరలేదు. అయినా సరే బొప్పరాజు… తగ్గిపోయారు. దీనికి కారణం.. సూర్యనారాయణ ఎదుర్కొంటున్న పరిస్థితులే.
ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, బండి శ్రీనివాసరావు ఎప్పుడో ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. తాము ప్రభుత్వంపై పోరాడినా ఉద్యోగులు తమను నమ్మరని వారు డిసైడయ్యారు. గతంలో ఉద్యోగుల్ని రోడ్డుపైకి తెచ్చి .. ఉద్యమాన్ని అమ్మేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బొప్పరాజు.. సూర్యనారాయణ అనే ఇద్దరు నేతలు పోరాడుతున్నారు. వీరిలో బొప్పరాజుకు సైలెంట్ అయిపోయినట్లే. సూర్యనారయణకు.. ఇతర వర్గాల నుంచి మద్దతు లభించడంలేదు. ప్రభుత్వం ఉద్యోగులవాయిస్ ని అలా నిర్వీర్యం చేసేసిందన్నమాట. పాపం ఉద్యోగులు అనుకోక తప్పదు.