ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. అయితే ఇప్పుడు ఆయనకు నెగెటివ్ వచ్చింది. ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించడంతో గందరగోళం పెరిగిపోయింది. ఈ నెల ఐదో తేదీన ఐర్లాండ్ నుంచి ఓ వ్యక్తి ముంబై వచ్చారు. అక్కడ కరోనా టెస్టులు చేయించుకోకుడా నేరుగా తిరుపతి ఎయిర్‌పోర్టుకు వచ్చారు.
అక్కడ్నుంచి తన అత్తగారి ఊరైన విజయనగరం వెళ్లిపోయారు. కరోనా టెస్టులు చేయించుకోకుడా రావడంతో ముంబై ఎయిర్‌పోర్టు సిబ్బంది అతని గురించి ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అతని ఆచూకీ పట్టుకుని శాంపిల్స్ తీసుకుని హోమ్ ఐసోలేషన్లోఉండాలని ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో అతనికి పాజిటివ్‌గా తేలడంతో స్వాబ్ నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ సీసీఎంబీకి పంపారు. అక్కడ ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది.
అయితే శనివారం మరోసారి అతనికికరోనా పరీక్షలు నిర్వహించారు. కానీ నెగెటివ్‌గా తేలింది. ఒమిక్రాన్ ఉన్న ఆ వ్యక్తి రిపోర్టు తెలియక ముందే చాలా మందిని కలిశారు. దీంతో అతడి స్వగ్రామంతో పాటు అత్తగారి ఇంటి పరిసరాల్లో ఉన్న వారందరికీ టెస్టులు చేస్తున్నారు. తొలి ఒమిక్రాన్ కేసు ఏపీలో బయటపడటంతో .. అధికారవర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి.