ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో అయినా వేస్తాం కానీ ఇంటికి తెచ్చి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. వృద్ధుల్ని తిప్ప వద్దని.. అయితే బ్యాంక్ కౌంట్లలో లేకపోతే ఇంటి దగ్గర ఇవ్వాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదట్లో చేసిన రాజకీయ డ్రామా చేస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన హెచ్చరికలు రావడంతో అధికారులు రూటు మార్చారు.
ఈ నెలతో పాటు వచ్చే నెల కూడా వృద్ధుల పెన్షన్ ను ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు. మిగిలిన పాతిక శాతం మందికి ఇంటికి వెళ్లి ఇస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వాలంటీర్లు లేకపోయినా వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో కార్యాలయంలో పది మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో సచివాలయ పరిధిలో నాలుగైదు వందల మంది పెన్షనర్లు ఉంటారు. వారికి ఒక్క రోజులో పంపిణీ చేయడం పెద్ద విషయం కాదు.
కానీ వాలంటీర్లు లేకపోతే అలా ఇవ్వలేరని చెప్పడానికి వైసీపీతో కుమ్మక్కయిన నేతలు ఇలా.. ఏదో ఓ కారణాన్ని వెదుక్కుంటున్నారు. వృద్ధులకు బ్యాంకుల్లో జమ చేసిన వారు బ్యాంకులకు వెళ్లి తీసుకోవాలి. దాని కోసమైనా తిరగాలి. ఎండల్లో వృద్ధులను ఇలా తిప్పేందుకు … అధికారులు ఎందుకు ఇంత డెస్పరేట్ గా ఉన్నారో కానీ.. ఆ వృద్ధుల సమస్యలను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు.