ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి జరిగిందని ప్రభుత్వం కేసు పెట్టింది. నిందితుల్ని చేర్చారు. అందులో లోకేష్ ను కూడా ఏ 14 అన్నారు. కానీ అసలు లోకేష్ పాత్ర ఏమిటి.. పధ్నాలుగో నెంబర్ ఎందుకు ఇచ్చారు అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే లోకేష్ కు ..సీఆర్డీఏకు ఎలాంటి సంబంధం లేదు. అధికారికంగా అసలు అమరావతి వ్యవహారాల్లో భాగం కాలేదు. మరి ఎలా కేసు పెట్టారు. ఎక్కడ నేరం చేశారని పెట్టారు అన్నది లోకేష్ లాయర్లకూ అర్థం కావడం లేదు.
ఇక్కడ కామెడీ ఏమిటంటే.. వైసీపీ వైళ్లకూ ఇందులో లోకేష్ పాత్రేమిటో క్లారిటీ లేదు. ఫైబర్ నెట్ స్కాంలో ఓ అధికారికి ఢిల్లీ వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారని సగం లేఖ చూపించి హడావుడి చేశారు.. మరి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సంబంధం ఏమిటి.. మామూలుగా చిన్న మిస్ లీడ్ చేసే ఆధారం ఉన్నా సాక్షిలో చిలువలు పలువులుగా చెబుతారు. అలాంటిదేమీ చెప్పలేదు. సీఐడీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టలేదు. అందులో వైసీపీ సోషల్ మీడియాలో వాళ్లు కూడా ఏ 14 అని ప్రచారం చేస్తున్నారు కానీ ఏం చేశారన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది లేదు. అసలు భూసేకరణ చేయలేదు . ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అధికారులు అలైన్ మెంట్ రెడీ చేశారు. అంతే.. అందులో లోకేష్ పాత్రేమిటో ఎవరికీ తెలియదు. కానీ సాక్షి మీడియా చెబుతున్న దాని ప్రకారం ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేసి నారా లోకేష్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసిందట ఏసీ సీఐడీ.
లబ్ది పొందాలని ప్రయత్నించడం ఏమిటో… దానికి కేసు పెట్టడం ఏమిటో.. నిందితుడుగా మార్చడం ఏమిటో… న్యాయనిపుణులకూ తలతిరిగిపోతోంది. ఆ లెక్కన..ఐఆర్ఆర్ పక్కన ఉన్న అన్ని స్థలాల వాళ్లను ముఖ్యంగా 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారందరిపైనా కేసులు వేయేలేమో ?. ఎందుకంటే ఐఆర్ఆర్కు హెరిటేజ్ అంతే దూరం ఉంది. కేసు కూడా పెట్టేశారు మరి.. !