ప్రభుత్వం అంటే ప్రజలు ఎన్నుకున్నది. ఆ ప్రభుత్వం ఏం చేసినా ప్రజలకు తెలిసేలా చేయాలి. రహస్యంగా చేయాలని అనుకుంటే.. తప్పు చేస్తున్నట్లే. అత్యంత కాన్ఫిడెన్షియల్ వి కొన్నే ఉంటాయి. మిగతా అంతా ప్రజలకు తెలియాలి. ప్రజాధనం ఎవరికి రూపాయి చెల్లించినా ఆ జీవోను ప్రజల ముందు పెట్టాలి. అందు కోసమే జీవోఐఆర్ అనే వెబ్ సైట్ ను కూడా పెట్టారు.
కానీ గత ప్రభుత్వం పాలన అంటే.. తమ ఇష్టారాజ్యమని.. అనుకున్నారు. అడ్డగోలుగా నిధులు కేటాయించుకుంటూ… పోయారు. ప్రభుత్వ ఆస్తులను కాజేశారు. అస్మదీయులకు దోచి పెట్టారు. అవన్నీ ప్రజలకు తెలిస్తే ఎక్కడ తిరుగుబాటు చేస్తారోనని… అసలు జీవోలే.. రహస్యంగా ఉంచడం ప్రారంభించారు. ఏకంగా జీవోఐఆర్ నే మూసేశారు. కోర్టులు చెప్పినా వినిపించుకోలేదు.
ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మళ్లీ ప్రజలకు అన్నీ తెలిసేలా పాలన చేయాలని నిర్ణయించుకుంది. జీవోఐఆర్ వెబ్ సైట్ను ప్రారంభించింది. మళ్లీ ప్రతి జీవోనూ అందులో అప్ లోడ్ చేయడం ప్రారంభించారు. పారదర్శక పాలనకు ఇది నిదర్శనమని పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.