ఏపీలో కార్డ్ ప్రైమ్ 2.0 అనే రిజిస్ట్రేషన్ వ్యవస్ధను తీసుకు వచ్చారు. కేవలం జిరాక్సులు ఇస్తున్నారు. అసలైన పత్రాలు వారి వద్దనే ఉంచుకుంటున్నారు. ఈ సాఫ్ట్ వేర్ ఎవరిదంటే క్రిటికల్ రివర్ అనే కంపెనీది. మారం అంజిరెడ్డి అనే వ్యక్తిదని రికార్డులు చెబుతున్నాయి కానీ జగన్ దగ్గర ఐటీ సలహాదారుగా పని చేసిన శేషిరెడ్డి దీని వెనుక కీలక పాత్రధారని ప్రభుత్వ వర్గాలు కనిపెట్టాయి.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్డు ప్రైమ్ 2.0 విధానంలో ఆస్తుల డాక్యుమెంట్లు, ఆస్తి దారుల ఫింగర్ ప్రింట్స్ ఏవీ ప్రభుత్వం వద్ద ఉండవు. సాధారణంగా ఇలాంటి ప్రజా ఆస్తులకు సంబంధించిన సమస్త సమాచారం నేషనల్ డేటా సెంటర్ లో ఉండాలి. కానీ జగన్ ప్రభుత్వం క్రిటికల్ రివర్ అనే కంపెనీ చేతుల్లో పెట్టింది క్రిటికల్ రివర్ అనే కంపెనీ ప్రారంభించి పదేళ్లు కూడా కాలేదు. మూడు వందల మంది ఉద్యోగులు ఉంటారు. ఈ కంపెనీ చేసేది మల్టీ నేషనల్ కంపెనీలు ఇచ్చే పని ఔట్ సోర్సింగ్ చేసి వారికివ్వడం. ప్రజల ఆస్తుల సంరక్షణ.. ఇతర విషయాల్లో వీరికి ఎలాంటి అనుభవం లేదు.
ఇప్పుడీ కంపెనీ వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అసలు లోపభూయిష్టమైన కార్డు ప్రైమ్ 2.0 విధానాన్ని వెనక్కి తీసుకునే అావకాశాలు ఉన్నాయి. ఆస్తుల పత్రాలు అసలైనవే ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మొత్తం సమగ్రమైన నివేదికను రెడీ చేయబోతున్నారు. క్రిటికల్ రివర్ కంపెనీ తప్పు చేసి ఉంటే కఠిన చర్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.