ఏపీ అధికార యంత్రాంగానికి ఎక్కడ లేని కష్టం వచ్చింది. కోడ్ ఉన్నందున సిన్సియర్ గా పని చేసినట్లుగా కనిపించాలి.. మరో వైపు తమ రాజకీయ బాసుల ఆకాంక్షలను గౌరవించాలి… ఇలా విన్యాసాలు చేస్తూ ఏపీ అధికార యంత్రాంగం ప్రజల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఓ వైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలను అణిచి వేస్తామని కేసులు పెట్టి… ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చే వరకూ కనీసం పట్టుకునే ప్రయత్నం చేయలేదు. పైగా చేజింగ్‌లు చేసినట్లుగా డ్రామాలు, వీడియోలు రిలీజ్ చేసి మరింత నవ్వుల పాలయ్యారు.
అల్లర్ల విషయంలో కేసులు పెట్టామంటూ హడావుడి చేస్తున్నారు కానీ.. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తే క్షణాల్లో కేసులు పెట్టేసి అరెస్టులు చేస్తున్నారు. తిరుపతిలో అదే జరిగింది. పోలీసులతో పాటు ఇతర అధికారులు కూడా ఈ డబుల్ యాక్షన్ చేస్తున్నారు. ఈసీకి టీడీపీ నేతలు చేస్తున్న ఫిర్యాదులపై స్పందిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు కానీ.. దేనిపైనా ముందడుగు వేయడం లేదు.
ప్రభుత్వం మారితే వచ్చే కొత్త ప్రభుత్వం తమను వదిలి పెట్టని.. వైసీపీ హయాంలో ఓవరాక్షన్ చేసిన వారంతా కిందా మీదా పడుతున్నారు. వీలైనంతగా తమ స్వామిభక్తిని ప్రదర్శించి వైసీపీని ఒడ్డున పడేయాలని చూస్తున్నారు. ఇలాంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. డిప్యూటేషన్ అధికారుల తీరుతో నలిగిపోయిన అనేక మంది సివిల్ సర్వీస్ అధికారులు… ఈ ప్రభుత్వం పోవాలని అనుకుంటున్నారు. కానీ వీరెవరికి కీలక బాధ్యతలు లేవు. ఉన్న వారు డబుల్ యాక్షన్ చేస్తున్నారు.