వైరస్ దెబ్బకు ఆదాయం లేక మనుగడ సమస్య ఎదుర్కొంటున్న న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో సాక్షి సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పత్రికకు దేశంలో ఇతర ఏ పత్రికకు లేనంత ఆదాయం కనిపించనుంది. జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఎప్పుడూ పన్నెండు లేదా 14 పేజీల్లో వచ్చే పత్రిక.. ఇరవై మూడు పేజీల్లో వచ్చింది. అందులో.. 16 పేజీల వరకూ యాడ్స్. వాటిలో ఎనభై శాతం ఫుల్ పేజీ.. కలర్ యాడ్సే. ప్రస్తుతం ఉన్న యాడ్ రేట్ల ప్రకారం… చూస్తే.. ప్రభుత్వంలోకి.. ఔట్ సో్ర్సింగ్ ప్రకారం తీసుకున్న సాక్షి ఉద్యోగులకు కాకుండా.. ఇప్పుడు కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఆరు నెలల జీతాలకు సరిపోయేలా.. ప్రకటనలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు ఓ ఫుల్ పేజీ ప్రకటన వస్తే.. పత్రికలు సంతోషపడిపోయే పరిస్థితి. కానీ.. సాక్షికి మాత్రం… అలాంటి ఇబ్బందే లేదు.. పేజీలకు పేజీలు యాడ్స్. ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు… ప్రభుత్వం దగ్గర పదవులు పొందినవారు.. ప్రభుత్వం దగ్గర కాంట్రాక్టులు పొందినవారు.. పార్టీ నేతలు.. కార్యకర్తలు.. ఇలా తమ శక్తివంచన లేకుండా ప్రకటనలతో సాక్షిని పోషించే ప్రయత్నం చేశారు. ఇంకా విశేషం ఏమింటే… ప్రభుత్వం కూడా.. ఈ ప్రకటన ఖర్చును భారీగా మోస్తోంది. అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న ఈనాడు పత్రికకు.. ఒక్క ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి.. మిగతా అంతా.. సాక్షి పత్రికకే మళ్లించుకుంటున్నారు.
రైతు భరోసా కేంద్రాలు శనివారమే ప్రారంభమయ్యాయి. కానీ.. ఆదివారం మరో ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. శనివారం ప్రారంభమయ్యాయని చెప్పడానికి ఆదివారం యాడ్ ఇచ్చారన్నమాట. ప్రజాధనం ఇలా ప్రకటనల రూపంలో పెద్ద ఎత్తున సాక్షి అకౌంట్కు చేరుతోందన్న విమర్శలు కొంత కాలం నుంచి వస్తున్నాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.