చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్ఆర్, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబును ఎన్నికలకు దూరం చేయాలన్న పన్నాగంతో సీఐడీ వరుసగా కేసులు పెట్టింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసిన తర్వాత ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేయడానికి పీటీ వారెంట్లు వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం కేసు, ఇసుక కేసు.. ఇలా పలు కేసుల్లో సీఐడీ చంద్రబబు పేరు చేర్చింది.
ఈ మూడు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొదట మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. ఇక, ఐఆర్ఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై గతంలో హైకోర్టు విచారణ జరిపి తిరస్కరించింది. దీనిపై సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.
అయితే క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇవవాల్సి ఉన్నందున విచారణ జరగడం లేదు. కానీ ఆ కేసులో అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు అక్టోబర్ 18వ తేదీన తీర్పు రిజర్వ్ చేశారు. ఇంకా తీర్పు రాలేదు. ఆ కేసులో తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే ఆయనపై నమోదు చేసిన కేసులన్నీ అక్రమమని తేలిపోతుంది.