స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ద సంస్థ అని.. దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ ప్రభుత్వం కల్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిధులు నిలిపివేసిందని.. విధి నిర్వహణకు సహకరించడంలేదని..నిమ్మగడ్డ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ప్రభఉత్వంపై అసహనం వ్యక్తం చేసింది. నీతి, నిజాయితీగా పనిచేసే అధికారులను మీరు ఇబ్బందులకు గురిచేయటం మంచిది కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
తనకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లి న్యాయంగా పదవి పొందిన వ్యక్తికి.. కావాలనే ప్రభుత్వం సహకరించడం లేదన్న అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం లాంటి రాజ్యాంగబద్ధ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. నిరంతరాయంగా పని చేసే ఇటువంటి వ్యవస్థలను కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది, లేకపోతే కుప్పకూలిపోతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం సహాయ సహకారాలందిస్తే ఎస్ఈసీ కోర్ట్ ను ఆశ్రయించే అవకాశం ఉండేది కాదని స్పష్టం చేసింది.
ఎస్ఈసీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా మీరెందుకు స్పందించలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి ఏం కావాలో ఎస్ఈసీ మూడ్రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియచేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ కోరివన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలని .. అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ధర్మాసనం హెచ్చరిక జారీ చేసింది. అమలు చేసిన కాపీని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
కనగరాజ్ నియామకం.. అనంతరం ఆయన కోసం చేసిన ఖర్చులు.. ఆయన లాయర్ల కోసం చేసిన ఖర్చులపై కూడా హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఆయన ఆ సొమ్మును వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకోవాలి తప్పితే ప్రభుత్వానికి ఏం సంబంధమని.. ఎందుకు ఖర్చు పెడుతుందని ప్రజల ధనాన్ని ఎందుకు ఇలా వృథా చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. వీటన్నింటిని కూడా ప్రస్తుతం ఉన్న ఎస్ఈసీ వాటిని పరిశీలించాలని సూచించింది. హైకోర్టు తీర్పుతో ఎస్ఈసీ విషయంలో ప్రభుత్వానికి మరోసారి షాక్ తగిలినట్లయింది.