మద్యం విషయంలో చంద్రబాబునాయుడు ఎక్స్ట్రీమ్ ఆలోచనలకు పోవడం లేదు. ఇప్పటికే మద్యం ఆదాయాన్ని జగన్ తాకట్టు పెట్టేసినందున ఆ వైపు నుంచి ఆదనపు ఆదాయాన్ని ఆయన ఆశించడం లేదు. కానీ పేదలకు రిలీఫ్ మాత్రం ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే కొత్త మద్యం పాలసీలో ఖచ్చితంగా రేట్ల తగ్గింపు ప్రక్రియ ఉండాలని డిసైడయ్యారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
రేట్లు పెంచితే.. అదీ కూడా షాక్ కొట్టేలా పెంచితే తాగేవారు తగ్గిపోతారన్న దిక్కుమాలిన ఆలోచనతో జగన్ చెలరేగిపోయారు. ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెంచి .. సొంత బ్రాండ్లను అమ్మి వేల కోట్లు పోగేసుకున్నారు. అయితే రేట్లు ఎక్కువ.. పిచ్చి బ్రాండ్ల కారణంగా ఓ స్థాయి మందుబాబులు పూర్తిగా స్మగ్లింగ్ మందుకు అలవాటుపడిపోయారు. మరీ దిగువన ఉన్న వారు నాటు సారా.. ఇతర చీప్ మద్యం వైపు వెళ్లిపోయారు. ఫలితంగా మందు అలవాటు ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలు పూర్తిగా నలిగిపోయాయి. వాళ్ల రక్తాన్ని జగన్ పీల్చేశారు.
ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో సమానంగా .. వీలైతే ఇంకా తక్కువగా.. పాపులర్ బ్రాండ్లు అమ్మితే.. నకిలీ మద్యం. విప్పసారా, స్మగ్లింగ్ మద్యం లాంటి జాడ్యాలన్నీ పోతాయి. ఆటోమేటిక్ గా ఆదాయం పెరుగుతుంది. మంచి బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చి ధరలు తగ్గిస్తే పిచ్చి బ్రాండ్ల నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుంది. వారిని పిండుకున్నట్లు లేకుండా ఉంటుంది. అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో మందుబాబులకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి.