ఏపీ ప్రభుత్వం మద్యం వ్యాపారం మొత్తాన్ని గుప్పిట పట్టడానికి చేసిన నిర్వాకాలు ఎంతో మందికి ముప్పు తెచ్చి పెడుతున్నాయి. కొత్త ప్రభుత్వం మద్యం దుకాణాల బాధ్యతను వదిలించుకోవాలని డిసైడయింది. వచ్చే నెలలో దుకాణాలు వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనుంది. దీంతో ఇప్పుడు ఉన్న దుకాణాల్లో పని చేస్తున్న వారు మా సంగతేమిటని ప్రశ్నించారు.
వైసీపీ కార్యకర్తలకు జగన్ కల్పించిన మరో ఉపాధి ఈ మద్యం దుకాణాలు. పదిహేను వేలకు ఎలా పని చేస్తున్నారో కానీ ఐదేళ్లుగా పని చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలతో పాటు వీరు కూడా పనిలో పనిగా దోచుకున్నారన్నమాట. అంతా నగదు వ్యవహారమే కాబట్టి.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయడం..డూప్లికేట్ మందు అమ్మడం వంటి నిర్వాకాలకు చాాలా సార్లు పాల్పడ్డారు. ఇలా అక్కడ పని చేసేవారంతా బాగానే వెనకేసుకున్నారు. వారంతా వైసీపీ లీడర్ల కనుసన్నల్లో పని చేసిన వారే.
అక్టోబర్ ఒకటి నుంచి వారిని తీసేయడం ఖాయం కావడంతో. ఇప్పుడు విధులకు రాబోమంటూ కొత్తగా బెదిరించడం ప్రారంభించారు. ఏడో తేదీ నుంచి దుకాణాలు తెరవబోమని చెబుతున్నారు. వారి వ్యవహారం ప్రభుత్వానికి సమస్య అవకపోవచ్చు కానీ.. వారికి మాత్రం ఉపాధి పోవడం ఖాయంగా కనిపిస్తోంది . ఇప్పటికే వాలంటీర్లను ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న ప్రభుత్వం .. మద్యం దుకాణాల్లో పని చేసే వారికీ ఇప్పుడు ఏదో ఒకటి సర్దుబాటు చేయాల్సిన పరిస్థఇతి కనిపిస్తోంది.