ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరిశ్రమలకు.. పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఐదేళ్లుగా ఏపీ ఇమేజ్ పై పడిన మరకల్ని తుడిచేసి .. కొత్త ఇమేజ్ బిల్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు పరిశ్రామిక వేత్తలు చంద్రబాబుతో సమావేశమై తమ పెట్టుబడుల ప్రణాళికలు వివరించారు. అదే సమయంలో గతంలో ప్రతిపాదనలు చేసుకుని జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా వెనక్కి వెళ్లిపోయిన వారితోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్
ఏపీకి మారిన పరిస్థితులను బట్టి మరింత మెరుగైన ఇండస్ట్రీయల్ పాలసీ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కొత్త ఇండస్ట్రియల్ పాలసీపై కసరత్తు చేస్తోంది. పరిశ్రమలకు ప్రభుత్వంపై భారం పడకుండా వీలైనంతగా ప్రోత్సహకాలు ఇచ్చేలా … ప్రభుత్వ పరంగా కానీ.. మరో విధమైన సమస్యలు రాకుండా చూసేలా గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాములుగా అయితే పెట్టుబడులు పెట్టాలంటే గత ఐదేళ్ల కాలంలో రాజకీయల నేతలకు కమిషన్లు ఇవ్వాల్సి వచ్చేది . జాకీ లాంటి పరిశ్రమ యూనిట్ నిర్మాణం ప్రారంభించి కూడా అందుకే వెళ్లిపోయింది.
ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించే ఏర్పాట్లు
ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని పారిశ్రామికవేత్తలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రత్యేక వ్యవస్థ,. వారి సమస్యలను ఎప్పటికప్పుడు గ్రీవెన్స్ చేస యంత్రాంగాన్ని కూడా రెడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త పాలసీలో కొన్ని ప్రత్యేకమైన రంగాలకు భారీ రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈవీ, ఐటీ రంగాలకు ప్రోత్సాహకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
రెండు నెలల్లోనే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్ అరవై వేల కోట్ల వరకూ పెట్టుబడి పెట్టనుంది . ఇక బ్రూక్ ఫీల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ, విన్ ఫాస్ట్ ఈవీ, ఫాక్స్ కాన్ ఈవీ , గోద్రెజ్, టీసీఎస్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, జెడ్‌టీఈ, ఆరియా గ్లోబల్ , మను జైన్ ఇండియా హెడ్ గా ఉన్న M42,లతో పాటు హెచ్‌సీఎల్, సుజలాన్ వంటి కంపెనీ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వచ్చాయి. వీరి ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లేలా కొత్త ఇండస్ట్రీ పాలసీని చంద్రబాబు రెడీ చేయనున్నారు