కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో జగన్ కటౌట్‌ను కొంత మంది దుండగులు కాల్చేశారు. అంతే.. జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఒక్క సారిగా అలర్ట్ అయిపోయింది. అంత అలర్ట్ అయిందంటే…ఉన్నతాధికారులు వెంటనే.. తమ ఆగ్రహాన్ని చూపించారు. కటౌట్ తగలబడిన ప్రాంతాన్ని డీఎస్పీ పరిశీలించారు. వెంటనే … డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపారు. క్లూస్ టీంలతో ఆధారాలు సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డీఎస్పీ సంబంధిత పోలీసుల్ని ఆదేశించారు. దానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ హడావుడి చూసి అందరూ ఔరా అనుకుంటున్నారు… ఎందుకంటే..?
రెండు రోజుల కిందట తునిలో పట్ట పగలు ఓ కిరాయి హంతకుడు.. ఓ తెలుగుదేశం పార్టీ నేత, సమాజంలో అందరికీ తెలిసిన వ్యక్తిపై దాడి చేశాడు. నరికి చంపబోయాడు. తృటిలో తప్పించుకున్నారు ఆ వ్యక్తి. కానీ ఆ హత్య చేయడానికి ప్రయత్నించిన వాడు మాత్రం నింపాదిగా పారిపోయాడు. వాళ్లు సుపారీ టీమ్లని తెలియడానికన్నట్లుగా వాళ్లు ఎక్కడ బస చేశారో.. అక్కడ్నుంచి పారిపోయారని.. మూడోరోజుకు కొన్ని వివరాలు చెప్పారు. అంతే కానీ.. నిందితుడ్ని ఖచ్చితంగా పట్టుకోవాలని.. కుట్ర వెనుక ఉన్న వారెవర్నో వెలికి తీయాలని కానీ పోలీసులు ఆసక్తి చూపలేదు.
పోలీసుల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది కానీ.. మరీ తాము వేసుకున్న ఖాకీ డ్రెస్‌కు కనీస న్యాయం చేయకుండా మనుషుల్ని పట్ట పగలు నరుకుతున్న వారినీ ఆషామాషీగా తీసుకున్నారు. కానీ .. కటౌట్ తగలబెట్టిన వారిపై మాత్రం అన్ని హైరానా పడుతున్నారు. ప్రజల ప్రాణాలకు లేని విలువ సీఎం జగన్ కటౌట్‌కు ఉందని.. పోలీసులు నిర్మోహమాటంగా .. చేతలతోనే తేల్చి చెప్పారు. ఏపీలో ప్రజలు ఇక .. తమ రక్షణ కోసం ..తాము తమ జాగ్రత్తల్లో ఉండాలేమో ?