ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఎక్సైజ్ శాఖ డాక్యుమెంట్లు మాయం చేస్తూ దొరికిపోయిన కేసు, గుడివాడలో మద్యం గోడౌన్ లీజు వ్యవహారంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే తిరస్కరించారు. అయినా సీఐడీ అరెస్టు చేయలేదు. ఆయన కు చెందిన హైదరాబాద్, విజయవాడల్లోని నివాసాల్లో సోదాలు చేశారు.
ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు లిక్కర్ స్కాంపై సీఐడీ విచారణకు ఆదేశించారు. దీంతో ప్రధాన కేసు నమోదు చేసి.. నిందితుల అరెస్టు ప్రారంభిస్తారని తెలియగానే ఆయన కనిపించకుండా పోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది. రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌కు చెందిన ఆయనను రాష్ట్రానికి తీసుకు వచ్చి..మద్యం బిజినెస్ చేతిలో పెట్టారు.అయితే ఆయన ఓ స్టాంప్ మాత్రమే మిగతా అంతా వైసీపీ నేతలే నడిపించారు. కానీ మొత్తం ఆయన పేరు మీద నడిచింది. దీంతో ఆయన అప్రూవర్ గా మారితే దొంగలంతా దొరికిపోతారు.
Also Read : ఏపీ లిక్కర్ స్కాం – ఓ కేస్ స్టడీ !
ఆయన అప్రూవర్ గా మారుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ లోపే ఆయన కనిపించకుండా పోయారు. దీంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు కనీ ఇప్పటికే ఆయన దేశం దాటి వెళ్లిపోయి ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అవకాశం ఉన్నప్పుడు అరెస్టు చేయకుండా ఆయన కనిపించకుండా పోయిన తర్వాత లుకౌట్ నోటీసులు జారీ చేస్తే ప్రయోజనం ఏమిటన్న చర్చ నడుస్తోంది.