అమరావతి రైతులు అలా పాదయాత్ర ప్రారంభించగానే ఇలా ప్రభుత్వం కుట్రల మీద కుట్రలు ప్రారంభించింది. ఓ వైపు ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ.. మరో వైపు షెడ్డుకెళ్లిపోయిన కేసుల్లో కొంత మందిని అరెస్ట్ చేస్తోంది. మరో వైపు కార్పొరేషన్ ప్రజాభిప్రాయసేకరణ అంటూ హడావుడి చేస్తున్నారు. రాజధాని అసైన్డ్ భూముల్లో అక్రమాలని ఎమ్మెల్యే ఆళ్ల రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసిన పోలీసులకు.. తము బాధితులమంటూ ఒక్కరు కూడా రాలేదు. అయినా సరే విచారణ జరిపి ఇప్పుడు ఐదుగుర్ని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు.
అసలు తమ భూములు తమ దగ్గరే ఉన్నాయని ఎవరికీ అమ్మలేదని ఆ దళిత రైతులు చెబుతున్నారు. కానీ సీఐడీ అధికారులు మాత్రం మీరు నారాయణ … బినామీలకు అమ్మేశారని తేల్చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనుకున్న వాళ్లని చేసేశారు. పదకొండు వంద ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. కానీ ఎక్కడా అలాంటి లావాదేవీలు లేవని గతంలోనే తేలింది. అయితే ఇప్పుడు కొత్తగా సీఐడీ అధికారులు అరెస్టులు చేసి కొత్తగా ఏదో చేసేశామని ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు.
ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా.. పోలీసులు, సీఐడీ వచ్చి వేధిస్తున్నా ఒక్క దళిత రైతు కూడా తమ భూములు అక్రమంగా లాక్కున్నారని చెప్పడం లేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారు కూడా తాము ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని … వారి వీడియోలను టీడీపీ అప్పట్లోనే టీడీపీ విడుదల చేసింది. కక్షతో కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం సీఐడీ లాంటి వ్యవస్థల్ని ఉపయోగించకుని నేరాలకు పాల్పడుతోందని ఎప్పటికైనా పాపం పండక తప్పదని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.