తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. నేటితో వీసీల పదవీకాలం ముగియడంతో కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇంచార్జ్ వీసీలను నియమించింది.
యూనివర్సిటీల వీసీల నియామకం కోసం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. వీటిని పరిశీలించి వీసీల పేర్లను సిఫార్స్ చేయడం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయగా ఎన్నికల ప్రక్రియ మొదలు అవ్వడంతో వీసీల నియామకంలో జాప్యం జరిగింది. వీసీల నియామకం కోసం ఈసీ అనుమతి సర్కార్ తీసుకున్నప్పటికీ సెర్చ్ కమిటీ సమావేశాలు ఇంకా మొదలు అవ్వలేదు. దీంతో పూర్తి స్థాయి వీసీల నియామకానికి మరికొంత సమయం పడుతుందని భావించిన ప్రభుత్వం ఇంచార్జ్ వీసీలను నియమించింది. అయితే, వీసీలుగా సీనియర్ ఐఏఎస్ లకు బాధ్యతలను అప్పగించింది.
10 యూనివర్సిటీలకు ఇంచార్జ్ వీసీలను నియమించిన ప్రభుత్వం
ఉస్మానియా యూనివర్సిటీ – దాన కిషోర్
జేఎన్టీయూ – బుర్ర వెంకటేశం
కాకతీయ యూనివర్సిటీ – కరుణ వాకాటి
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ – రిజ్వి
తెలంగాణ వర్సిటీ -సందీప్ సుల్తానియా
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ – శైలజ రామయ్యర్
మహాత్మా గాంధీ యూనివర్సిటీ – నవీన్ మిట్టల్
శాతవాహన యూనివర్సిటీ – సురేంద్రమోహన్
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ – జయేష్ రంజన్
పాలమూరు యూనివర్సిటీ – నదీం అహ్మద్