భారతీయులు ఏ దేశమేగినా తమ ప్రతిభను పరిమళింపచేస్తున్నారు. జర్మనీలో మహా నగరం బాన్ మేయర్ గా భారత సంతతికి చెందిన అశోక్ శ్రీధరన్ ఎన్నికయ్యారు. చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ కు చెందిన క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
శ్రీధరన్ 50.06 శాతం ఓట్లతో పరిపూర్ణమైన మెజారిటీ సాధించారు. బాన్ లో 21 ఏళ్లుగా కొనసాగుతున్న సోషల్ డెమొక్రటిక్ పార్టీ పెత్తనానికి తెరదించారు. జర్మనీలో ఓ చారిత్రక నగరం బాన్. చాన్స్ లర్ రెండో అధికారిక నివాసం ఉన్నది ఈ నగరంలోనే. జర్మనీలో అధికారికంగా పలు విధాలుగా బాన్ కీలక నగరం. ఇలాంటి నగర మేయర్ గా 49 ఏళ్ల ప్రవాస భారతీయుడు పగ్గాలు చేపట్టబోతున్నాడు.
శ్రీధరన్ తండ్రి బారత్ నుంచి జర్మనీ వెళ్లి స్థిరపడ్డారు. తల్లి జర్మన్. బాన్ మేయర్ గా అక్టోబర్ 21న శ్రీధరన్ బాధ్యతలు స్వీకరిస్తారు.