తెలుగు సినిమా డైరెక్టర్స్‌లో చాలా మందికి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తాలూకూ ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు. అందరూ చేస్తున్నారు కాబట్టి మనమూ చేస్తున్నాం అనుకునేవాళ్ళే ఎక్కువ. మొత్తం షూట్ చేసిన విజువల్స్, సీన్స్‌లో నుంచి ది బెస్ట్ అనుకున్నవి ట్రైలర్లో యాడ్ చేస్తారు. ఆ దుస్థితి నుంచి తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి ఇప్పుడిప్పుడే చందు మొండేటి, అవసరాల శ్రీనివాస్ లాంటి డైరెక్టర్స్ వస్తున్నారు. ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా చాలా మంది వస్తే రాబోయే దర్శకులకు ఓ గైడ్లో ఉపయోగపడతారు.
సినిమా చూడాలి అన్న క్యూరియాసిటీని ఆడియన్స్‌లో క్రియేట్ చేయడమే ట్రైలర్ టార్గెట్. దాదాపుగా రెండు నిమిషాల వీడియోలో చూపించిన అవుట్ పుట్ మొత్తం బాగుండాలి. చూపించని రెండు గంటల సినిమాను ఎప్పుడెప్పుడు చూసేద్దామా? అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలగాలి. సినిమాలో ఏదో కొత్తగా చెప్పినట్టున్నాడే. ఏం చెప్పి ఉంటాడు? అసలు కథ ఏమై ఉంటుంది? అని ట్రైలర్ చూసిన ప్రేక్షకుడి మదిలో రకరకాల ఆలోచనలు కలిగించాలి. ఆ సినిమా టైటిల్ వాడి మైండ్‌లో రిజిస్టర్ అవ్వాలి. ఆ సినిమా రిలీజ్ డేట్ కోసం వాడు వెయిట్ చేయాలి. మన దగ్గర రిలీజ్ అయ్యే తొంభై శాతం సినిమాల ట్రైలర్స్‌లో అసలు ఏ విషయమూ ఉండదు. ఆ పైన తొమ్మిది శాతం సినిమాల ట్రైలర్స్‌లో మాత్రం చూపించిన అవుట్ పుట్ బాగుంటుంది. దాన్ని నమ్మిన ప్రేక్షకులు మిగతా రెండు గంటల సినిమా కూడా బాగుంటుందన్న ఉద్ధేశ్యంతో సినిమాకు వెళ్తూ ఉంటారు. కానీ ఒక్క శాతం సినిమాల ట్రైలర్స్ మాత్రం ది బెస్ట్ అనిపించుకుంటాయి. అలాంటిదే ‘జ్యో అచ్యుతానంద’ ట్రైలర్.
ట్రైలర్లో చూపించిన ప్రతి షాట్, ప్రతి విజువల్, ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్, కాస్ట్యూమ్స్, మ్యూజిక్, ఎడిటింగ్, ఫొటోగ్రఫీ….ఒకటని కాదు అన్నీ బాగున్నాయి. ట్రైలర్ మొత్తం కూడా క్యారెక్టర్సే కనిపించాయి. డైరెక్టర్ అవసరాల కనిపించాడు. అతని ప్రతిభ కనిపించింది. ప్రేక్షకులకు కథ అర్థం కాకూడదన్న ఉద్ధేశ్యంతో వంకర ప్రయత్నాలు కూడా ఏమీ చేయలేదు. నిజాయితీగా తన సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్లోనే చెప్పేశాడు. అలాగే వీడియో చూసేశాం. నెక్స్ వీడియోకి వెళ్ళిపోదాం అని ఆడియన్స్ వెంటనే డిస్కనెక్ట్ అయ్యేలాగా కాకుండా ఆ ట్రైలర్లో చెప్పిన విషయం గురించి ఆలోచించేలా చేశాడు. సినిమాలో ఏం చెప్పబోతున్నాడా? అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేయగలిగాడు. వేరే జానర్ సినిమాలయితే ఈ ప్రక్రియ మొత్తం కొంచెం సులభమేనేమో కానీ మనం ఆల్రెడీ కొన్ని వందల సార్లు చూసేసి ఉన్న సింపుల్ లవ్ స్టోరీతో ఇలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం మాత్రం మామూలు విషయం కాదు. అందుకే అవసరాల సినిమా ట్రైలర్ అద్భుతః.