దేశంలో అత్యంత ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించే సంస్థగా పేరున్న యాక్సిస్ మై ఇండియా ఏపీ అసెంబ్లీ అంచనాలను ప్రకటించింది. కూటమి యాభై శాతానికిపైగా ఓట్లతో 98 నుంచి 120 సీట్ల వరకూ సాధించే అవశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 55 నుంచి 77 సీట్ల వరకూ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్టిట్ పోల్లో తెలిపింది. కూటమిలో ఒక్క టీడీపీకే 78 నుంచి 96 సీట్లు వస్తాయని అంచనా. జనసేన పార్టీకి 16 నుంచి 18 సీట్లు, బీజేపీకి 4 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ సున్నా నుంచి రెండు సీట్లను గెలిచే చాన్స్ ఉంది.
వైఎస్ఆర్సీపీకి 44 శాతం ఓట్లు ఉంటాయని అంచనా వేశారు. 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీకి 41 శాతం ఓట్లు, 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేనకు 7 శాతం, పది అసెంబ్లీ సీట్లలో పోటీచేసిన బీజేపీకి రెండు శాతం ఓట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ పార్టీకి రెండు శాతం ఓట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది.
పురుషులు, మహిళా ఓటర్లలో రెండింటిలోనూ ఎన్డీఏ కూటమికి ఓట్ల శాతం పెరిగింది. పురుషుల్లో 54 శాతం.. మహిళల్లో 48 శాతం మంది ఎన్డీఏ కూటమికి జై కొట్టారు.
లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ తో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మెరుగైన ఫలితాలను సాధించబోతోందని మై యాక్సిస్ అంచనా వేసింది. లోక్ సభ సీట్లు రెండు నుంచి నాలుగు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. కానీ అసెంబ్లీ సీట్లు మాత్రం.. 55 నుంచి 77 వరకూ వేయడంతో ఎక్కువ మంది అసెంబ్లీకి క్రాస్ ఓటింగ్ చేశారన్న విశ్లేషణ మై యాక్సిస్ చేసిందని నుకోవచ్చు.