ఇటీవల కాలంలో ఓ సినిమా విడుదలకు ముందే బిజినెస్ క్లోజ్ చేసుకోవడం, నిర్మాత టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోవడం చాలా అరుదైన విషయాలు. టీజరూ, ట్రైలరూ బాగుండి, విపరీతమైన బజ్ ఉంటే తప్ప, ఏ సినిమా కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదు. ఓటీటీలు అస్సలు ఆసక్తి చూపించడం లేదు. అలాంటిది టీజర్, ట్రైలర్ ఏదీ చూపించకుండానే, ఒకే ఒక్క పోస్టర్ తో సినిమా బిజినెస్ మొత్తం క్లియర్ చేసుకొంది ‘బచ్చలమల్లి’.
నరేష్ హీరోగా నటించిన సినిమా ఇది. సుబ్బు దర్శకుడు. రాజేష్ దండా నిర్మాత. ఈ సినిమా బిజినెస్ అప్పుడే క్లోజ్ అయిపోయింది. నాన్ థియేట్రికల్ రూపంలో రూ.9 కోట్లు వచ్చాయి. థియేట్రికల్ నుంచి రూ.5 కోట్లు వచ్చాయి. మొత్తం రూ.14 కోట్లు. ఇటీవల బచ్చల మల్లి నుంచి ఓ మాస్ పోస్టర్ వచ్చింది. ఆ ఒక్క పోస్టర్ తరవాత బిజినెస్ డీల్స్ అన్నీ ఒకొక్కటిగా క్లోజ్ అయ్యాయి. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే టీజర్ వదులుతారు. ప్రస్తుతానికి నిర్మాత సేఫ్‌లో ఉన్నట్టే లెక్క. విడుదల తరవాత ఓవర్‌ఫ్లోస్ ఎన్ని వస్తాయి అనేదాన్ని పై ప్రాఫిట్ ఆధారపడి ఉంటుంది. నరేష్ గత చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఫ్లాప్ అయ్యింది. అలాంటి డిజాస్టర్ తరవాత కూడా నరేష్ సినిమా ఈ రేంజ్లో బిజినెస్ జరుపుకోవడం మామూలు విషయం కాదు. నిర్మాత లక్కీనే అనుకోవాలి.