హైదరాబాద్: విశాఖపట్నంలో జరుగుతున్న ‘విశాఖ ఉత్సవ్’ కార్యక్రమం ముగింపు వేడుకల్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ, తాను పొద్దున్న లేవగానే చుట్ట తాగుతానని చెప్పారు. గొంతుకోసం, ఆరోగ్యంకోసం ఇలా చేస్తానని అన్నారు. పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ అని కవులే చెప్పారంటూ ఆ పద్యాన్ని కూడా పాడి వినిపించారు. పొగ తాగనివారు ప్యూర్ బఫెలో అవుతారని అన్నారు. ఏమిటిలా చుట్ట తాగుతున్నారని తనను చాలామంది అడుగుతూ ఉంటారని చెప్పారు. దానికి వివరణగా భారతానికి సంబంధించిన మరో పద్యాన్ని పాడి వినిపించారు. ఇవన్నీ మన సంప్రదాయాలు, సంస్కృతికి చెందిన సీసపద్యాలని చెప్పారు. “పాడు చేసి చంపేస్తానంటే మూసుకునుంటానుకున్నారా నా కొడకల్లారా” అంటూ తన రాబోయే చిత్రం ‘డిక్టేటర్’లోని డైలాగులను కూడా చెప్పి సభికులను అలరించారు. మొత్తానికి బాలయ్య డైలాగులు విశాఖవాసులను షాక్కు గురిచేసినా వారు వాటన్నింటినీ ఎంజాయ్ చేశారు. సినీ నటులు శివారెడ్డి, ఉదయభాను, శ్రీలక్ష్మి, సుదీప(పింకీ) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.