బాలకృష్ణ అంటే చాలా మందికి భయం. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదని అంటుంటారు. అందుకే ఆయనతో సినిమా అంటే నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా కాస్త జంకుతూ ఉంటారు. అయితే బాలయ్యని అర్థం చేసుకొన్నవాళ్లకు మాత్రం.. ఆయనింకా పసి పిల్లోడే అనిపిస్తుంది. బాలయ్యతో బాండింగ్ ఏర్పడితే… ఇక దాన్ని వదల్లేం. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ ఆ అనుబంధాన్ని, బాలయ్య బాండింగ్ ని ఆస్వాదిస్తోంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాలో చెల్లెలు సెంటిమెంట్ కి ప్రాధాన్యం ఉంది. బాలయ్య చెల్లెలుగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది. బాలయ్యతో కలిసి నటించడం ఇదే తొలిసారి. అయితేనేం బాలయ్య కంపెనీని బాగా ఆస్వాదిస్తోంది. కెమెరా ముందు పాత్రకు తగ్గట్టు `అన్నా` అని పిలుస్తోంది. కెమెరా కట్ చేస్తే.. `డాడీ డాడీ` అంటూ చిన్నపిల్లలా బాలయ్య వేలు పట్టుకొని తిరుగుతోందట. బాలయ్య కూడా.. రాధికా శరత్ కుమార్ని సొంత కూతురిలా ట్రీట్ చేస్తున్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కట్ చెప్పగానే… ఇద్దరూ ఓ చోట కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నారని, కలిసి భోజనం చేస్తున్నారని, వరలక్ష్మి సెట్లో ఉంటే బాలయ్య ఏమీ పట్టించుకోవడం లేదని వీరిద్దరి అనుబంధం… సెట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తోందని టాక్,. బాలయ్య – వరలక్ష్మిల బాండింగే ఇప్పుడు సెట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇది వరకు కూడా తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. అయితే తన పని తనదే తప్ప.. సెట్లో ఎవరితోనూ కలుపుగోలుగా ఉండేది కాదట. కానీ బాలయ్యని మాత్రం క్షణం వదలడం లేదని, బాలయ్య ఏదో మంత్రం వేశాడని చెప్పుకొంటున్నారు.