నిర్మాత బండ్ల గణేష్ కి దూకుడు ఎక్కువ. ఆయనకి క్రేజ్ తెచ్చింది కూడా ఈ దూకుడు స్వభావమే. సెన్సార్ లేకుండా మాట్లడేయం ఆయన స్టయిల్. ఐతే ఈ దూకుడు స్వభావంతో కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చుకున్నారు. ముఖ్యంగా బండ్ల, త్రివిక్రమ్ వివాదం గురించి చాలా మందికి పరిచయం వుంటుంది. పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ చాలా సన్నిహితంగా వుంటారు. ఒకానొక పవన్ కళ్యాణ్ ఈవెంట్ కి తనని ఇన్వైట్ చేయకోపోవడంలో తివిక్రమ్ హస్తం వుందని ఫీలయ్యారు బండ్ల. ఈ విషయంలో ఓ అభిమానితో బండ్ల మాట్లాడిన ఆడియో క్లిప్ చాలా వైరల్ అయ్యింది. ఈ వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ కి బండ్లకి మధ్య కూడా గ్యాప్ వచ్చిందని అప్పట్లో చెప్పుకున్నారు.
అయితే ఈ మొత్తం వివాదంలో ఎట్టకేలకు తివిక్రమ్ కి సారీ చెప్పారు బండ్ల. ‘‘తీన్మార్ ఫ్లాప్ వల్ల బాధలో ఉన్నప్పుడు హీరోతో మాట్లాడి.. నాకు గబ్బర్ సింగ్ అవకాశం గురించి మొదట చెప్పింది త్రివిక్రమ్. ఆయనకు ధన్యవాదాలు. ఒక అభిమాని ఫోన్ చేసినప్పుడు ఏదో మూడ్లో ఉండి కాస్త నోరు జారాను. చాలా తప్పు చేశాననిపించింది. ఈసందర్భంగా ఆయనకు క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది’అని బహిరంగ క్షమాపణ కోరారు బండ్ల.
గబ్బర్ సింగ్ రీరిలీజ్ పనుల్లో వున్నారు బండ్ల. మళ్ళీ సినిమాలు చేయాలనే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఇండస్ట్రీలో అందరితో సఖ్యతగా వుండాలి. ముఖ్యంగా త్రివిక్రమ్ లాంటి దర్శకులు సఖ్యతగా వుండటం చాలా అవసరం కూడా. ఈ నేపధ్యంలోనే బండ్ల ఒకడుగు ముందుకేసి ఓపెన్ గా సారీ చెప్పారు. మరి ఈ క్షమాపణతో త్రివిక్రమ్ బండ్ల మధ్య వచ్చిన గ్యాప్ సమసిపోతుందో లేదో చూడాలి.