బంగ్లాదేశ్ విదేశీ శక్తుల గుప్పిట చిక్కిందని అంతకంతకూ పెరుగుతున్న హింసనే నిరూపిస్తోంది. రిజర్వేషన్ల వివాదంపై యువతలో తిరుగుబాటు వచ్చిందని దానికి సైన్యం కూడా మద్దతుగా ఉండటంతో ప్రజా తీర్పు ద్వారా ఎన్నికైన ప్రధాన మంత్రి కూడా పారిపోవాల్సి వచ్చిందని అనుకుటున్నారు. అదే నిజమైతే ఇంకా హింస ఎందుకు జరుగుతోంది?
హసీనా పారిపోతే విజయోత్సవాలు జరగలేదు. అదే సందనుకుని హింసను ప్రారంభించారు. దేశానికి చెడ్డపేరు తెచ్చేలా మైనార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఆ దేశంలో ముస్లిమేతరులు మైనారిటీలు. ఎందుకు మనుషుల్ని చంపుతున్నారో.. ఎందుకు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారో ఎవరికీతెలియదు. దేశంలోన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చేందుకు వరుస డిమండ్లు చేస్తున్నారు.
మొదట పార్లమెంట్ ను రద్దు చేశారు. తర్వాత ప్రజలకు సంబంధం లేదని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు . ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపే నోబెల్ గ్రహీత యూనస్ కూడాహింస ఆపండి ప్లీజ్ అని బతిమాలుతున్నారు. దేశంలో సుప్రీంకోర్టు సహా అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేసి.. నిర్వీర్యం చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజీనామాలు చేశారు. బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ గవర్నర్ నూ పంపేసారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే బంగ్లాదేశ్లో పూర్తిగా అదుపుతప్పి పోయింది. నిజంగా ప్రధానిపై తిరుగుబాటు అయితే ఆమె పారిపోగానే సద్దుమణగాలి..కానీ అంతకు మించి ఏదో జరుగుతోంది. బంగ్లాదేశ్ కల్లోలిత ప్రాంతంగా మారిపోతుందని..మరో పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్లా అవుతుందన్న ఆందోళన సహంజగానే వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. భారత్ కు కూడా నష్టమే.