మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు లేవు. కానీ లేటరైట్‌కు అనుమతులు ఉన్నాయి. ఆ లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వేసి తీసుకెళ్తున్నారని చాలా రోజులుగా ఏపీలో దుమారం రేగుతోంది. ఎన్జీటీకి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. వాటి సంగతి పక్కన పెడితే ఇప్పుడు వైఎస్ హయాంలో విశాఖ మన్యంలో నెలకొల్పిన బాక్సైట్ పరిశ్రమ ప్రారంభమయింది. గతంలో పూర్తిగా అనుమతులు పూర్తిగా రద్దు చేయడంతో మూసేశారు. కానీ కొంత కాలం నుంచి అక్కడ పనులు జరుగుతున్నాయి. పవర్ ప్లాంట్‌ను పునరుద్ధరించారు. ఉద్యోగుల్ని పునర్నియామకం చేస్తున్నారు. అసలు బాక్సైట్ తవ్వకాలకు అనుమతి లేదు.. ఎలా చేస్తారు అన్న సందేహం చాలా మందికి వస్తోంది. కానీ ప్రభుత్వం దానికి లేటరైట్ పేరుతో సొల్యూషన్ చూపించినట్లుగా కనిపిస్తోంది.
తక్కున నాణ్యత ఉన్న ఖనిజాన్ని లే్టరైట్ అని..ఎక్కువ నాణ్యత ఉన్న దాన్ని బాక్సైట్ అంటారు. ఈ రెడింటిని పోల్చుకోవడం నిపుణులకే సాధ్యం. ఇప్పటికే లైటరైట్ పేరుతో మన్యంలో విస్తృతంగా మైనింగ్ జరుగుతుంది. అన్‌రాక్‌కు కూడా లేటరైట్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. లీజులు కూడా కేటాయించి తవ్వుకోవడానికి అనుమతులు ఇస్తారని అంటున్నారు. పూర్తిగా లేటరైట్‌తో సాధ్యం కాదు కాబట్టి… కొంత దిగుమతి చేసుకుంటామని కూడా చెప్పబోతున్నారు.
గయానా నుంచి లక్ష టన్నుల బాక్సైట్‌ను తీసుకొచ్చామని ప్రకటించి… పనులు ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. బాక్సైట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ గురించి మైనింగ్ గురించి తెలిసిన వారందరికీ తెలుసు. గయానా నుంచి బాక్సైట్ ఇక్కడకు తీసుకు వచ్చి.. పరిశ్రమ నడుపుతారంటే నమ్మడానికి పరిశ్రమ వర్గాలు కూడా సిద్ధంగా లేవు. కానీ ఎన్నో విషయాల్లో ప్రజలను సులువుగా నమ్మించగలిగామని భావిస్తున్న అధికార పెద్దలు ఈ విషయాన్నీ నమ్మించగలమనే నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.అందుకే ఎంత వ్యతిరేకత వచ్చినా బాక్సైట్ పరిశ్రమను మళ్లీ ఏదో ఓ కారణంతో ప్రారంభించేస్తున్నారు.
ఈ బాక్సైట్ పరిశ్రమలో వివాదం అర్బిట్రేషన్‌లో ఉంది. పెట్టుబడి పెట్టిన సర్ అల్ ఖైమా కేసులు పెట్టింది. పెన్నా ప్రతాపరెడ్డితో వారికి డబ్బులు కట్టించి.. అంతా ఆయనకే ఉండేలా ప్రభుత్వం వ్యూహం పన్నుతోందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ అంశం ఇలా క్లియర్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వబోతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చంటున్నారు.