సచిన్ ను మిస్ అవుతున్నాం… గంగూలీ దూకుడు చూసి ఎన్నాళ్లైందో… యువీ సిక్సులు, హర్భజన్ స్పిన్… రికీ పాంటింగ్ డ్రైవ్స్… ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో ఆలోచన. దేశం ఎదైనా క్రికెట్ ను ప్రేమించే వారికి ఎందో మంది అభిమాన ఆటగాళ్లుంటారు. కానీ వారంతా రిటైర్ అయ్యారు. మైదానంలో మైక్ తప్పా బ్యాట్, బాల్ తో కనిపించే అవకాశం చాలా చాలా తక్కువ.
అయితే, లెజెండ్స్ ను మళ్లీ మైదానంలోకి దింపితే…? ఐపీఎల్ తరహాలో లెజెండ్స్ క్రికెట్ లీగ్ ను మొదలుపెడితే…? ఇప్పుడు ఇదే ఆలోచనల్లో ఉంది బీసీసీఐ. కాసుల వర్షం కురిపించే లీగ్స్ ను నిర్వహించటంలో రాటుదేలిన బీసీసీఐ… ఇప్పుడు సీనియర్లను మైదానంలోకి దింపే ఆలోచనలను స్పీడప్ చేసింది.
ఐపీఎల్ సక్సెస్ ఫుల్ లీగ్. ఏడాదికి ఒకసారి ఉంటుంది. సమ్మర్ లో ఓ మంచి ఎంజాయ్మెంట్ గా అభిమానిస్తారు. ఇప్పుడు ఐపీఎల్ లాగే లెజెండ్స్ క్రికెట్ లీగ్ ను తీసుకొచ్చి… ప్రతి యేడాది అక్టోబర్ లేదా నవంబర్ లో నిర్వహించే యోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఎలాగైతే ఆటగాళ్లను వేలం వేస్తారో… అలాగే లెజెండ్స్ జట్ల ఎంపిక కూడా ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ముందుగా కీలకమైన ఆటగాళ్లతో సంప్రదింపులు జరపటంతో పాటు ఆయా దేశాల క్రికెట్ బోర్డులతోనూ మాట్లాడక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం కొన్ని లెజెండ్స్ తో కొన్ని లీగ్స్ నడుస్తున్నాయి. అందులో యువరాజ్, హర్భజన్, పఠాన్ బ్రదర్స్ తో పాటు రైనా వంటి ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇది మరింత పెద్దదిగా… అధికారికంగా జరగిగే అవకాశాలున్నాయి.