ఏబీవీకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. కానీ రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది. తెల్ల వారే సరికి ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం, పోస్టింగ్ ఇవ్వడం , రిటైర్మెంట్ అన్నీ స్మూత్ గా జరిగిపోయేలా ఏర్పాట్లు చేసేశారు. అనుకున్నట్లుగా వ్యవహారం పూర్తయిపోయింది. అయితే ఏబీవీని ఇబ్బంది పెట్టాలనుకున్న వైసీపీ పెద్దలు, విధేయ అధికారులు ఎందుకు మనసు మార్చుకున్నారన్నది ఏపీ అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఫలితాలపై స్పష్టత రావడంతో కేంద్ర పెద్దల నుంచి హెచ్చరికలు వచ్చాయని హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాట్ అన్నీ చెప్పిన తర్వాత కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఓ డీజీ స్థాయి అధికారి రిటైర్ అయితే అందుకు తగ్గ పరిణామాలను సంబంధిత అధికారులు ఖచ్చితంగా అనుభవించాల్సిందేనని హెచ్చరికలు వచ్చినట్లుగా చెబుతున్నారు. జవహర్ రెడ్డి వచ్చే నెలాఖరును రిటైర్ కానున్నారు. ఆయనపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారితే ఆయన పరిస్థితి ఏబీవీ కంటే దారుణం అవుతుంది. కోర్టు ఉత్తర్వులు కూడా లెక్క చేయలేదనే రిమార్క్ ఉంటే.. చెప్పాల్సిన పని లేదు.
వైసీపీ పెద్దల నుంచి ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వొద్దని తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ జవహర్ రెడ్డి తన బాగు కోసం పట్టించుకోలేదని అంటున్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. అధికారుల సంగతి తేలుస్తామని చెప్పడం వెనుక.. రోజంతా జరిగిన పరిణామాలు ఉన్నాయని ఉంటున్నారు. ఓ వైపు సజ్జలపై క్రిమినల్ కేసు.. మరో వైపు ఏబీవీకి పోస్టింగ్ ఇలా.. అన్నీ వైసీపీకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఒక్కరు కూడా వారి మాటలు వినడం లేదు.