బెంగళూరుకు అతి దగ్గరగా ఉన్న అనంతపురంలో ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. మొదటి దశ యూనిట్ నిర్మాణం చివరి దశఖు వచ్చింది. దక్షిణ భారతదేశంలో, BEL యూనిట్లు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై , మచిలీపట్నంలలో ఉన్నాయి. ఇప్పుడు పాలసముద్రంలో కొత్త యూనిట్ నిర్మిస్తున్నారు.
మచిలీపట్నంలో బీఈఎల్ సాయుధ బలగాలకు నైట్ విజన్ గ్లాసులను తయారు చేస్తోంది. అలాగే కృష్ణా జిల్లాలోని నిమ్మలూరులో రానున్న మరో ఫ్యాక్టరీని విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పాలసముద్రంలో 2016లో బీఈఎల్ యూనిట్ ఏర్పాటుకు క్షిపణి, రాడార్ పరీక్షల తయారీకి 914 ఎకరాల భూమిని కేటాయించారు. వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆలస్యమయింది. అన్ని సమస్యలు పరిష్కారం కావడంతో రెండేళ్ల కిందట పాలసముద్రంలో మొదటి దశ పనులకు రూ.384 కోట్లు విడుదల చేశారు. డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ గా పిలుస్తున్నారు.
బెల్ వల్ల తొమ్మిది వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్, ఇన్నోవేషన్, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అందుబాటులోకి వస్తాయి. బెంగళూరుకు దగ్గరగా ఉండటటమే కాదు.. అనంతపురం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా ఎంతో మేలు చేస్తున్నాయి. జిల్లాను అభివృద్ధి పథంలో పయనించి.. యువతకు ఉపాధి కలిగేలా చేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి.