బెల్లంకొండ సాయిశ్రీనివాస్ – సాగర్ చంద్ర కాంబోలో ఓ సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఓ షెడ్యూల్ కూడా జరిగింది. అయితే ఈ సినిమాపై బోలెడన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆర్థిక సమస్యల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని, సెకండాఫ్ లేకుండా సినిమా మొదలెట్టారని, అందుకే బెల్లంకొండ ఈ సినిమాని హోల్డ్ లో పెట్టాడని రకరకాల వార్తలొచ్చాయి.
అయితే ఇవేం నిజాలు కావని తేలిపోయింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈనెల 30 నుంచి మొదలు కానుంది. ఈ లెంగ్తీ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలతో పాటు, యాక్షన్ సీన్ ని కూడా పూర్తి చేస్తారు. ఈ సినిమాలో బెల్లంకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమా కోసం పలు టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే టైటిల్ ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించి, ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలకమైన అప్ డేట్ ఇవ్వబోతోంది. సో.. సాగర్ చంద్ర సినిమా ఆగిపోలేదన్నమాట.