కాప్ కథలంటే.. అందరికీ మమకారమే. మాస్ ఇమేజ్ కి పోలీస్ కథలే కేరాఫ్ అడ్రస్స్. ఎత్తూ, పొడవూ ఉన్న హీరోలు పోలీసులుగా కనిపిస్తే.. సిల్వర్ స్క్రీన్ మరింతగా వెలిగిపోతుంది. ఇప్పుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కూడా అదే పనిలో ఉన్నాడని టాక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ‘టైసన్ నాయుడు’ అనే పేరు ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇందులో బెల్లంకొండ ఓ టిపికల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. ఈ పోలీస్ క్యారెక్టర్ చాలా వైరైటీగా ఉంటుందని, మాస్‌ని నచ్చేస్తుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. బెల్లంకొండ హైటూ, పర్సనాలిటీ.. పోలీస్ పాత్రలకు బాగా సూటవుతుంది. తను ఇప్పటి వరకూ ఖాకీ యూనిఫామ్ కట్టింది లేదు. తన వరకూ ఈ పాత్ర కొత్తగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రానికి నిర్మాతలు. కథనాయికని ఫైనల్ చేయాల్సివుంది. కొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే.. ఇప్పటి వరకూ ఎవర్నీ ఫిక్స్ చేయలేదు. ఈ వారంలో కథానాయిక ఎవరన్నదీ తెలుస్తుంది. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.