వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు.. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే… తన విజయ సోపానాలుగా భావిస్తోంది. అందుకు సోషల్ మీడియాను… వాహకంగా ఉపయోగించుకుంటోంది. నిజం ఒక్క అడుగు వేసేలోపు.. అబద్దం ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది. సోషల్ మీడియా జమానాలో.. అసలు నిజం బయటకు వచ్చినా నమ్మలేని పరిస్థితి వచ్చేసింది. రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఇదే పెద్ద వరంగా మారింది. ప్రత్యర్థులపై ఎలాగైనా విజయం సాధించాలన్నపట్టుదలకు పోతున్న వైసీపీ.. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.
ఫేక్ వీడియోలతో కుల, మత ఘర్షణలు రేపే ప్రయత్నాలా..?
ప్రత్యేకంగా వైసీపీ వేల మందిని సోషల్ మీడియా వాలంటీర్లుగా నియమించుకుంది. కొన్ని టీముల్ని తమకు అనుకూల ప్రచారానికి… చాలా టీముల్ని ప్రత్యర్థులపై దుష్ప్రచారానికే వాడుకుంటోంది. కొన్ని ప్రత్యేకమైన ఎజెండాలను.. కూడా పెట్టుకున్నట్లుగా.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. కులం పేరుతో రెచ్చగొట్టడం.. మతం పేరుతో విద్వేషాలు పెంచడం.. ఇలా కొన్ని లక్ష్యాలతో.. వైసీపీ ..తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. చింతమేనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే వీడియో క్లిప్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోందని… ఆ పార్టీకి చెందిన టీవీ చానల్ రాత్రి సమయంలో ప్రసారం చేసింది. దాన్ని ఉదయమే .. ఆ పార్టీకి చెందిన పత్రిక.. ప్రధాన వార్తగా ప్రచురించింది. ఈ రెండు వార్తల్లోనూ… చింతమనేని ఫలానామా మాటలు అన్నాడని.. ప్రముఖంగా రాశారు. కానీ.. చివరికి.. ఆన్ లైన్ లో వైరల్ అవుతుందని కవర్ చేశారు. అంటే… ఈ వార్తకు.., తమ మీడియాకు సంబంధం లేదని ప్రకటించుకోవడం అన్నమాట. ఇది మార్ఫింగ్ అని స్పష్టంగా.. ఆ మీడియా యాజమాన్యానికి తెలిసినప్పటికీ.. కావాలంటే.. కొన్ని వర్గాలను రెచ్చగొట్టడానికి ఇలా చేశారని.. రాజకీయాల గురించి ఏ కొంచెం తెలిసిన వారికైనా అర్థమైపోతుంది. ఈ ప్రచారం చూసి.. చింతమనేని లబోదిబోమనాల్సి వచ్చింది.
నిజం తెలిసినా ఎందుకు అదే విద్వేషం..?
చింతమనేని వీడియోను మార్ఫింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ.. జరిగిన దుష్ప్రచారం ఎలా ఆగుతుంది..? అసలు చింతమనేని ఏమన్నాడో… నిజం ఎంత మందికి తెలుస్తుంది..? తెలిసినా ఆ ఫేక్ వీడియో సర్క్యూలేట్ కావడం ఆగదు. అదే.. ఆయా రాజకీయ పార్టీలకు కావాల్సింది. ఎలాగైనా.. అది తప్పు అయినా సరే… వారిపై.. ఓ వర్గాన్ని రెచ్చగొట్టడానికి ఈ ఫేక్ మార్గాన్ని ఎంచుకుని.. తమకు అందుబాటులో ఉన్న మార్గాల్లో వైరల్ చేశారు. వీటి ద్వారా సమాజంలో అశాంతి రేకెత్తినా.. మరొకటి అయినా వారికేం పట్టింపు ఉండదు. అల్లర్లు చెలరేగి.. ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగినా… అంతిమంగా తమకు రాజకీయలబ్ది కలగితే చాలనుకుంటున్న రాజకీయ పార్టీలు ఇలాంటి ప్రచారాలకు ఏ మాత్రం.. వెనుకడుగు వేయడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలాంటి సోషల్ మీడియా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఎన్నికల్లోపు ఇంకెన్ని విద్వేష ప్రయత్నాలు జరుగుతాయి..?
కొండవీడులో.. ఓ రైతు తన పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో.. అక్కడ కొండవీడు ఉత్సవాలు జరగడం, ఆ కార్యక్రమానికి సీఎం రావడం, కోటయ్య అనే రైతు లీజుకు తీసుకున్న పొలంలో ఖాళీగా ఉన్న దాంట్లో పోలీసులు కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవడం తప్పయిపోయింది. వెంటనే.. ఆ ఆత్మహత్యను పోలీసులు కొట్టి చంపినట్లుగా మార్చేసి.. దాన్ని ప్రభుత్వానికి అన్వయించేసి.. ఉద్ధృతంగా ప్రచారం నిర్వహించారు. తాము ప్రాణం తీయలేదని.. ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించామని.. పోలీసులు వీడియో రిలీజ్ చేసినా… వారిపై దుష్ప్రచారం సాగుతూనే ఉంది. రైతు మృతిపై ఎంత పకడ్బందీగా విష ప్రచారం చేశారో… ఇతరులు టైమ్ లైన్ తో సహా పోస్టులు పెట్టారు. చివరికి రైతుకు సామాజికవర్గం రంగు కూడా పూయడంతో.. అలా ప్రచారం చేస్తున్న వారి లక్ష్యం ఏమిటో… సాధారణ ప్రజలకు క్లారిటీ వచ్చేసింది.
రాజకీయం కోసం ఆస్తి, ప్రాణనష్టాలు జరిగినా సంతోషమేనా..?
ప్రత్యర్థులను టార్గెట్ చేసి.. మార్ఫింగ్ వీడియోలతో లేదా ఫేక్ ఫోటోలతో అయినా వ్యతిరేక ప్రచారం చేసేస్తారు. తమ ప్రత్యర్థులపై.. కులాలు, మతాలు, ప్రాంతాలను రెచ్చగొట్టేస్తారు. ఘర్షణలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగినా వారికి పట్టింపు ఉండదు. అది కుట్ర అని చెప్పుకోవడానికి ఆరోపణలు ఎదుర్కొన్న వారు తంటాలు పడాలి. జరిగే నష్టం భరించాలి. కుట్ర చేసిన వారు మాత్రం..సోషల్ మీడియా పేరు చెప్పుకుని రాజకీయ లబ్ది పొందుతారు. ఎలాగైనా గెలవాలనుకే పార్టీలు ఉన్న ఈ సమయంలో.. ముందు ముందు ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉడబోతోంది. ఇది ఏపీ రాజకీయాలకు పొంచి ఉన్న మరో ప్రళయం లాంటిది..!