ట్రంప్ వర్సెస్ బైడెన్ అన్నట్లు పోటీ సాగినప్పుడు.. బైడెన్ కన్నా ట్రంపే బెటరనీ జనం అనుకున్నారు. ఆయనకు ఏకపక్ష మద్దతు లభించబోతోందని సర్వేలు వచ్చాయి. ట్రంప్‌పై ఎప్పుడైతే హత్యాయత్నం జరిగిందో అప్పుడు ఇక సానుభూతి వర్షంలో తడిసి ముద్దయిపోతారని ఇక ఎదురే లేదని అనుకున్నారు. కానీ రిపబ్లికన్లు వేసిన ఒకే ఒక్క పాచికతో మొత్తం మారిపోయింది.
బైడెన్ అభ్యర్థిత్వం నుంచి వైదొలగడంతో ఉపాధ్యక్షరాలిగా ఉన్న కమలా హ్యారిస్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. మొల్లగా ఆమె .. ప్రజల్లో పలుకుబడి పెంచుకున్నారు. ట్రంప్ కన్నా హ్యారీసే బెటరన్న అభిప్రాయానికి వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. కమలా హారిస్ తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కన్నా నాలుగు పాయింట్లు ఆధిక్యంలో ఉన్నట్లు తాజా ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. మూడు కీలకమైన రాష్ట్రాలు విస్కాన్సిన్, పెన్నిల్వేనియా, మిచిగాన్లలో ట్రంప్ పై ఆధిక్యత సాధించారు.
మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను కమలా హ్యారీస్.,. ఉపాధ్యక్ష అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం ఈ సర్వే చేపట్టారు. కమలా హారిస్‌ను డెమక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ట్రంప్ గ్రాఫ్ పడిపోనారంభించింది. అధ్యక్షురాలిగా కమలా హారిస్ సమర్థవంతంగా సేవలందిస్తారని ఓటర్లు భావిస్తున్నారు. ఈ హవా ఇంతే కొనసాగితే.. ఎన్నికలు జరిగే నవంబర్ నాటికి కమలా హ్యారిస్ పూర్తి ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉంది.