వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పొలిటికల్ స్ట్రాటజీల కోసం.. ఐ ప్యాక్.. ప్రశాంత్ కిషోర్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారు. గత ఆ ఆరు నెలలుగా… సర్వేలు చేసి.. అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించిన పీకే టీం.. ఇప్పుడు… కొన్ని స్పెషల్ ఆపరేషన్లు కూడా చేపట్టింది. టీడీపీకి చెందిన కీలకమైన నియోజకవర్గాల్లో … అభ్యర్థులను ఓడించేందుకు.. సర్వే రిపోర్టులు తీసుకుని.. కులాల వారీగా… ఎక్కడెక్కడ లోటు ఉంది.. ఎక్కడెక్కడ టీడీపీ నేతల్ని వైసీపీలో చేర్చుకోవాలి.. దానికి ఎంత బడ్జెట్ అనే అంశాలను … రెడీ చేసుకుని..ఆయన నియోజకవర్గాలకు ప్రత్యేకమైన టీముల్ని పంపినట్లు బయటపడింది.
నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో.. ఓ ప్రత్యేకమైన డ్రెస్ కోడ్‌తో ఉదయమే.. హైదరాబాద్ నుంచి.. అద్దె కార్లలో… నలభై నుంచి యాభై మంది… దిగారు. వారు… తమ దగ్గరున్న సర్వే రిపోర్టులు.. ఎవరెవర్ని కలవాలో .. ఏమేం ఆఫర్లు ఇవ్వాలో.. ప్రత్యేకంగా నోట్ చేసుకుని మరీ వచ్చినట్లు తెలుస్తోంది. ఓ ఏడుగుర్ని పట్టుకున్న టీడీపీ నేతలు పోలీసులకు అప్పగించడంతో కలకలం బయలుదేరింది. తాము సర్వే కోసం వచ్చామని చెబుతున్నప్పటికీ… వారు వద్ద.. సర్వేకు సంబంధించిన సరంజామా కంటే.. టీడీపీ నేతల వివరాలే ఎక్కువగా ఉండటంతో… పోలీసులకు అప్పగించారు. పోలీసులు వీరెవరు..? ఎక్కడ్నుంచి వచ్చారు..? ఏం చేస్తున్నారు…? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఐ ప్యాక్ టీం సభ్యులమని.. వారు ప్రాథమికంగా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
మంగళగిరిలో లోకేష్‌ను ఓడించడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలో.. అభ్యర్థిని మారుద్దామని అనుకున్నా.. చివరికి ఆళ్ల రామకృష్ణారెడ్డికే చాన్సిచ్చారు. ఆయనకు.. ఆయన సోదరుడు.. వైఎస్ హయాంలో.. తన ఆస్తుల్ని… వేల కోట్లు పెంచేసుకున్న రాంకీ సంస్థల అధినేత ఆళ్ల అయోధ్యరామిరెడ్డి.. కావాల్సిన బడ్జెట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఐ ప్యాక్ టీం.. పూర్తి స్థాయిలో… టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.