తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎజెండాను భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఎన్నికలకు ముందు ‘బీసీ సీఎం’ నినాదాన్ని ప్రకటించింది. అభ్యర్థి ఎవరన్నది చెప్పకుండానే.. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఆ పార్టీ అగ్రనాయకత్వం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలో అధికారం సాధించాలంటే బీసీలను మరింత ఆకట్టుకోవాల్సిందేనని, పైగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బీసీ నేతలకు తగినంత ప్రాధాన్యత, ప్రాతినిధ్యం దక్కడం లేదన్న ఆవేదన బీసీ వర్గాల్లో ఉన్నందున, దాన్ని తాము అనుకూలంగా మలచుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు.
టిక్కెట్లను బీసీలకు ఎక్కుువ కేటాయించాలని నిర్ణయించారు. తెలంగాణలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 12 ఎస్టీ, 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు మినహాయిస్తే…. 88 జనరల్ స్థానాలు ఉంటాయి. ఇందులో 40 సీట్లను బీసీలకు ఇచ్చే అంశం పైన కసరత్తు సాగుతోంది. జనసేనతో ఎన్నికల సర్దుబాట్ల పైన ఇప్పటికే చర్చలు జరగటంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే చర్చ సాగుతోంది. ఆరు నెలల కిందటి వరకూ తెలంగాణలో పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్నట్లుగా వాతావరణం ఉంది. ఇప్పుడు బీజేపీ తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకునేందుకు తాపత్రయ పడుతోంది. రా
బండి సంజయే చీఫ్ గా ఉండి.. ఇప్పుడు బీసీ నినాదం వినిపించి ఉంటే.. ఖచ్చింగా ఆ ఇంపాక్ట్ ప్రజల్లో ఉండేదన్న అభిప్రాయం ఉంది. రేసు నుంచి వెనుకబడిన తర్వాత బీసీనే సీఎం అని నినాదం ఇస్తే ప్రయోజనం ఎంత అనే చర్చ కూడా వస్తుంది. ఇదే విషయాన్ని ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. అసలు బండి సంజయ్ ను ఎందుకు తప్పించారో చెప్పాలంటున్నాయి. దీనికి బీజేపీ వద్ద సమాధానం లేదు. నిజంగా బండి సంజయ్ చీఫ్ గా ఉండి… ఇప్పుడు బీసీ నినాదం ఇచ్చి ఉంటే బీజేపీకి బాగా ప్లస్ అయ్యేదన్న వాదన ఉంది.