జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవసరం బీజేపీ హైకమాండ్‌కు మరోసారి గుర్తుకు వచ్చింది. తమతో భేటీకి రావాలని ఆయనకు ఆహ్వానంపంపారు. ఉదయపూర్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు వెళ్లిన పవన్ కల్యాణ్ అటు నుంచి ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డా, అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే పవన్ కల్యాణ్‌ను పిలిపించిన పని.. ఏపీ రాజకీయాలు కాదని చెబుతున్నారు. కర్ణాటకలో పవన్ తో ప్రచారం చేయించుకోవాలనుకుంటున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
కర్ణాటక ఎన్నికల్లో విజయం కోసం ఉన్న అవకాశాలన్నింటినీ వాడుకోవాలని చూస్తోంది భారతీయ జనతాపార్టీ. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని కూడా ప్రచారంలోకి దించాలని భావిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఈ స్నేహంతోనే కర్ణాటకలో ప్రచారం చేయాలని రిక్వస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన్ని ఢిల్లీకి పిలిపించి మాట్లాడబోతున్నట్టు సమాచారం. ఉత్తర కర్ణాటకలో చాలా వరకూ తెలుగు ప్రాబల్యమే ఎక్కువ.
బళ్లారి దగ్గర మొదలుపెట్టి రాయచూరు, సింధనూరు, గంగావతి, దవణగిరి, గుల్బర్గ, బీదర్ వరకూ అయితే ఆంధ్రా, లేదంటే తెలంగాణ సెటిలర్స్ ది కీలక వర్గం. మరి ఆ తెలుగు ఓట్లను ప్రభావితం చేసేలా స్టార్ క్యాంపెయినర్ గా పవన్ ఉపయోగపడతారు అనేది బీజేపీ భావన. అందుకే ఆయన్ని స్టార్ క్యాంపెయినర్‌గా దించాలని బీజేపీ ప్లాన్. గతంలో కూడా ఆయన కొంత మంది స్నేహితుల కోసం కర్ణాటకలో ప్రచారం చేశారు. మరి బీజేపీ పెద్దల విజ్ఞప్తిని పవన్ మన్నిస్తారో లేదో చూడాల్సి ఉంది.