మూడు రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్య విజయాలు సాధించింది. కానీ ముఖ్యమంత్రి ఎవరో మాత్రం తేల్చుకోలేకపోతోంది. రాష్ట్రాల నుంచి ఢిల్లీ వరకు చర్చోపచర్చలు , సమావేశాలు జరుగుతున్నా సీఎం కుర్చీ రగడ మాత్రం చల్లారటం లేదు. ఎన్నికల ఫలితాలొచ్చి వారం రోజులైనా.. బీజేపీ హైకమాండ్ నాన్చుతూనే ఉన్నది.
రాజస్థాన్ లో పార్టీ చీలిపోయే పరిస్థితి కనిపిస్తోది. వసుంధర రాజేకు పదవి ఇవ్వకూడదని మోదీ పట్టుదలగా ఉన్నారు. కానీ ఆమె తనను సీఎం జరగకపోతే ఏం జరుగుతుందో శాంపిల్ చూపిస్తున్నారు. రాజస్థాన్లో తన వర్గం ఎమ్మెల్ేలతో బలప్రదర్శన చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం దాదాపు 60 మంది కొత్త ఎమ్మెల్యేలతో వసుంధర రాజే తన నివాసంలో సమావేశ మయ్యారు. వసుంధర రాజేను సీఎం చేయాలని ఈ ఎమ్మెల్యేలు మీడియా ముందు బాహాటంగానే డిమాండ్ చేశారు. అయితే, ముఖ్యమంత్రి పేరు ను పార్టీ పార్లమెంట రీ బోర్డు నిర్ణయిస్తుం దని, అంతకు ముందు బీజేపీ శాసనసభా పక్ష సమావేశాన్ని పిలుస్తామని బీజేపీ స్పష్టం చేసింది.
మధ్యప్రదేశ్ లో సీఎంగా చౌహాన్ ఉన్నారు. ఆయన పేరునూ ఖరారు చేయడడం లేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో సీఎం కావడానికి ఏ నాయకుడి ప్రయత్నం కనిపించటం లేదు. పైకి మాత్రం అంతా హైకమాండ్ నిర్ణయమంటూ..లోలోన మాత్రం సీఎం కుర్చీ దక్కకపోతే తేల్చుకుందామన్న ధోరణి కనిపిస్తోంది. రాజస్థాన్లో ఊహించని సందడి కనిపిస్తోంది. వసుంధర రాజే ఎమ్మెల్యేలను కలవడం ద్వారా మద్దతు కూడగట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. సీఎం అభ్యర్థులపై కాంగ్రెస్ ను విమర్శించేవారు.. బీజేపీ విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు.