హుజురాబాద్ ఉపఎన్నికల కారణంగా దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని పోలింగ్‌కు వారం ముందు ఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అమలు చేసుకోవచ్చని చెప్పింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నాలుగో తేదీ నుంచి దళిత బంధును ఎవరూ అడ్డుకోలేరని ప్లీనరీలో ప్రకటించారు. అయితే హుజురాబాద్‌లో ఫలితం అధికార పార్టీకి అనుకూలంగా రాకపోవడంతో ఇప్పుడు ఆ పథకం అమలు విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలాఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మామూలుగా ఎన్నికలు ఉన్నా… రెండు నెలల్లో దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తింప చేయలేకపోయారు.
రూ. పది లక్షలు వారికి అందించలేకపోయారు. ఈ కారణంగా ప్రజల్లో అపనమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఈసీ ఆంక్షలు ముగిసిపోయాయి. ఇక రైతు బంధును అమలు చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి. అయితే కేసీఆర్ కావాలని ఆలస్యంచేస్తారని వచ్చే ఎన్నికల వరకూ సాగదీస్తారన్న అనుమానంతో ఉన్న బీజేపీ ఆ పథకాన్ని శరవేగంగా అమలు చేయాలంటూ ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే విషయాన్ని ప్రకటించారు.
ఈ రోజునుంచి దళిత బంధును మళ్లీ అమలు చేయకపోతే ఊరుకునేది లేదన్నారు. హుజురాబాద్ నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. హుజురాబాద్‌తో పాటు మరో నాలుగు మండలాలకు కూడా గతంలోకేసీఆర్ నిధులు మంజూరు చేశారు. అక్కడా అమలు చేయాల్సి ఉంది. ఇప్పుడు ఎన్నిక ముగిసిందని కేసీఆర్ లైట్ తీసుకుంటే అసలు ఎన్నికకు దళిత బంధు పథకం సైడ్ ఎఫెక్ట్‌గా మారే అవకాశం ఉంది.